జేసీకి వయసు పెరిగి బుర్ర చిన్నదవుతోందా..? మృతుని కుటుంబంతో ఆ మాటలేంటి..?

బోల్డ్ గా మాట్లాడతాడని అందరూ అంటూంటే.. దాన్ని పొగడ్తలుగా తీసుకుంటున్నారేమో కానీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రోజురోజుకూ… హద్దులు దాటి పోతున్నారు. రాజకీయాల్లో ఏం మాట్లాడినా చెల్లుబాటవుతుందేమో కానీ.. సున్నితమైన విషయాల్లో మాత్రం… నోరు కాస్త అదుపులో పెట్టుకోవాల్సిందే. కానీ నాకు చెప్పే మొనగాడెవరు అనుకుంటారేమో .. జేసీ దివాకర్ రెడ్డి.. అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ.. తనకు కనీస మానవత్వం లేదని నిరూపించుకుంటున్నారు.

ఐదు రోజుల క్రితం తాడిపత్రి శివారులోని ఓ స్టీల్ ఫ్యాక్టరీలో విషవాయువులు లీకయ్యాయి. ఆరుగురు కార్మికులు చనిపోయారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే.. ఈ ఘటన జరిగిందని తీవ్రమైన ఆరోపణలున్నాయి. స్థానిక ఎంపీగా … ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీకి వెళ్లిన జేసీ దివాకర్ రెడ్డి … ప్రవర్తన అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. తప్పు ఫ్యాక్టరీ యాజమాన్యందని అందరూ అంటున్నా … అదంతా కర్మ ప్రకారమే జరిగిందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు మృతుడి తల్లితో అత్యంత హీనంగా మాట్లాడారు. అతని కర్మ ప్రకారమే అతను చనిపోయాడన్నట్లుగా… అందులో స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యం తప్పేమీ లేదన్నట్లు మాట్లాడారు.

మృతుల కుటుంబాలకు న్యాయం చేసే విషయంలో జేసీ దివాకర్ రెడ్డి… కృషి చేశారు. ప్రభుత్వం తరపున.. ఫ్యాక్టరీ యాజమాన్యం తరపున కూడా.. సాయం అందేలా చూశారు. కానీ… మృతుని కుటుంబీకులతో ఆయన అన్న మాటలు మాత్రం అత్యంత అభ్యంతరకరకంగా మారాయి. గతంలో ఆయన ఎన్నో వివాదాస్పద మాటలు మాట్లాడినా.. ఓ వర్గం అయినా మద్దతు తెలిపేది. ఈ విషయంలో జేసీకి ఎలాంటి మద్దతు దొరకడం లేదు. కొన్నాళ్ల కిందట.. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో … కూడా… పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చనిపోయారు. అప్పుడు కూడా.. అదో ప్రమాదమే…తలరాత ప్రకారమే అలా జరిగిందనే అర్థంలో మాట్లాడి విమర్శలు తెచ్చుకున్నారు. ఇప్పుడు మానవ తప్పిదం వల్ల పోయిన ప్రాణాలను.. కూడా…కర్మ ప్రకారమే జరిగిందని.. చెబుతూ.. తీవ్ర విమర్శల పాలవుతున్నారు. జేసీ దివాకర్ రెడ్డి కి వయసు పెరుగుతున్న కొద్దీ.. బుర్ర చిన్నది అవుతోందని… ప్రతిపక్ష పార్టీ నేతలు మండి పడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close