సుధీర్‌బాబు బ్యాడ్ ల‌క్ అనుకోవాలా??

ఏ సినిమా ఎప్పుడు హిట్ట‌వుతుందో, ఏ ఫార్ములా ఎప్పుడు వ‌ర్క‌వుట్ అవుతుందో చెప్ప‌లేం. ఇష్ట‌ప‌డి చేసిన క‌థ‌లు ప‌ల్టీలు కొట్ట‌డం, భ‌య‌ప‌డి వ‌దిలేసిన సినిమాలు హిట్ట‌వ్వ‌డం చూస్తూనే ఉన్నాం. తాజాగా సుధీర్‌బాబుకీ ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది. గ‌త వారం విడుద‌లై.. బాక్సాఫీసుని షేక్ చేస్తున్న చిన్న సినిమా.. `ఆర్ ఎక్స్ 100`. ఇప్ప‌టికి రూ.5 కోట్ల‌కు పై చిలుకు వ‌సూళ్లు అందుకుంది. శాటిలైట్ ప‌రంగానూ భారీగా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ద‌ర్శ‌కుడికీ, క‌థానాయిక‌కీ, హీరోకి మంచి పేరొచ్చింది. అయితే ఈ ఆఫ‌ర్ ముందు సుధీర్ బాబు ద‌గ్గ‌ర‌కు వెళ్లింద‌ట‌. క‌థ విన్న త‌ర‌వాత‌… `బాగానే ఉంది గానీ, ఇంత బోల్డ్ అయితే నేను చేయ‌లేను` అనేశాడ‌ట సుధీర్‌. దాంతో.. ఈ ఆఫ‌ర్ కాస్త కార్తికేయ ద‌గ్గ‌ర ఆగింది. సుధీర్‌కి క్లాస్ ఇమేజ్ ఉంది. `స‌మ్మోహ‌నం`తో అది ఇంకాస్త పెరిగింది. నిజంగానే సుధీర్ ఈ సినిమా చేస్తే… ఇంకాస్త మైలేజీ వ‌ద్దును. కానీ… సుధీర్ శృంగార ప‌ర‌మైన స‌న్నివేశాల్లో న‌టించ‌డానికి కాస్త ఇబ్బంది ప‌డుతుంటాడు. పైగా కొత్త హీరో కాబ‌ట్టి ఎలాంటి అంచ‌నాలూ లేకుండా జ‌నాలు థియేట‌ర్‌కి వెళ్లాడు. హీరో ఏడ్చినా, ప్రేమ‌లో ఫెయిల్ అయినా, మోస‌పోయినా.. జ‌నం నెగిటీవ్‌గా తీసుకోలేదు. ఒక‌వేళ సుధీర్ బాబు హీరో అయితే.. క‌థ‌లో మార్పులు చేర్పులూ త‌ప్ప‌కుండా జ‌రిగేవి. ఇంత బోల్డ్ నెస్ అప్పుడు చూసే అవ‌కాశం ద‌క్కేది కాదు. పైగా జ‌నాలు కాస్తో కూస్తో అంచ‌నాలు పెట్టుకుని థియేట‌ర్‌కి వ‌చ్చేవారు. ఇవ‌న్నీ `ఆర్ ఎక్స్ 100`కి ప్ర‌తికూలంగా మార్చే ఛాన్సుంది. కాబ‌ట్టి.. సుధీర్‌బాబు నిర్ణ‌యాన్నీ త‌ప్పుప‌ట్ట‌లేం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close