తేజ్ ఎఫెక్ట్ చ‌ర‌ణ్ సినిమాపై..??

క్రియేటీవ్ క‌మ‌ర్షియ‌ల్ మూవీస్ సంస్థ ఇప్పుడిప్పుడే యాక్టీవ్ అవుతోంది. గ‌త కొన్నేళ్లుగా సినిమారంగానికి దూరంగా ఉన్న కె.ఎస్ రామారావు కాస్త శ‌క్తిని కూడదీసుకుని సినిమాల్ని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లో రామ్ చ‌ర‌ణ్‌తో ఓసినిమా చేయాల‌ని ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నారు. అయితే… ఈ ప్రాజెక్టుపై ఆయ‌న‌కు రాను రాను ఆశక్తి స‌న్న‌గిల్లుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల ఈయ‌న సంస్థ నుంచి వ‌చ్చిన `తేజ్‌` అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాతో రామారావు భారీ న‌ష్టాల్ని చ‌విచూశారు. ఈ సినిమా ప‌రాజ‌యంతో రామారావు పూర్తిగా అస‌హ‌నానికీ అసంతృప్తికీ లోనైన‌ట్టు స‌మాచారం. ఈ ఎఫెక్ట్ రాబోయే సినిమాల‌పై త‌ప్ప‌కుండా ప‌డుతుంది. `మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు` సంస్థ‌కు లాభాలేం తీసుకురాలేదు. బొటాబొటీగా గ‌ట్టెక్కిందంతే. అంత‌కు ముందు `ద‌మ్ము` ఎఫెక్ట్ నుంచి ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కూ బ‌య‌ట‌ప‌డిందే లేదు. భారీ సినిమాలు పెద్ద‌గా ఆశాజ‌న‌కంగా లేవ‌ని, చిన్న సినిమాల్ని తీస్తూ వ‌స్తున్నారు. అవి కూడా.. ఆయ‌న్ని ఇబ్బంది పెడుతున్నాయి.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓసినిమా ఓకే అయ్యింది. విజ‌య్‌కి మంచి మార్కెట్ ఉంది కాబ‌ట్టి, ఈసినిమాని ముందే అమ్ముకుని సేఫ్ అవ్వొచ్చు. అయితే… ఈ సినిమాకి సంబంధించిన కార్య‌క్ర‌మాలు కూడ న‌త్త న‌డ‌క న‌డుస్తున్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ కాల్షీట్లు ఎప్పుడిస్తాడ‌న్న‌ది ఇంకా తేల‌లేదు. మ‌రోవైపు క్రాంతిమాధ‌వ్‌తోనే సినిమా చేయాలా, లేదంటే వేరే ద‌ర్శ‌కుడ్ని ఎంచుకోవాలా? అనేదీ అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌గా మారింది. ఎందుకంటే క్రాంతి మాధ‌వ్ నుంచి వ‌చ్చిన ఉంగ‌రాల రాంబాబు అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. ఆ ఎఫెక్ట్ త‌న సినిమాపై ప‌డుతుందేమో అని ఆయ‌న భ‌యం. ఇన్ని భ‌యాల మ‌ధ్య రామ్‌చ‌ర‌ణ్‌తో సినిమా జ‌రిగే ప‌ని కాద‌ని, ఆయ‌న ముందే ఈ సినిమా నుంచి డ్రాప్ అయిన‌ట్టు తెలుస్తోంది. చ‌ర‌ణ్ సినిమా చేస్తా.. అని ముందుకొచ్చినా… చ‌ర‌ణ్ డేట్లు దొర‌క‌డం చాలా క‌ష్టం. ఇప్ప‌టికే రాజ‌మౌళి లైన్‌లో ఉన్నాడు. ఆ సినిమా 2020లో గానీ పూర్త‌వ్వ‌దు. అందుకే క్రియేటీవ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌లో చ‌ర‌ణ్ సినిమా అనేది ప్ర‌స్తుతానికి ప‌క్క‌కు వెళ్లిపోయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ వెదుకులాట!

బీఆర్ఎస్ ను చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది....

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న జోరు చూపిస్తోంది. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టాక‌, ఆ ఉత్సాహం మ‌రింత‌గా పెరిగిపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కాలు పెడుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జోడీ క‌ట్ట‌డానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close