జనసేన టోటల్ ఆన్‌లైన్..! ఐటీ కంపెనీని మించేలా ఐటీ వింగ్..!!

” నేను వంద సీట్లు గెలుస్తా..సీఎం అవుతానంటాడు”… జగన్ ..” నేను నూట ఇరవై సీట్లు గెలుస్తా..నువ్వెలా సీఎం అవుతావ్” అంటాడు చంద్రబాబు…”మీరిద్దరూ ఏంటీ. నా ఫ్యాన్స్ ట్విట్టర్‌లో రెండు మిలియన్ల షేర్లు చేశారు..నేను ముఖ్యమంత్రిని అయిపోతున్నానంటాడు” పవన్..” .. ప్రస్తుతానికి ఇది ఆన్‌లైన్‌లో వైరల్ జోక్. ఇలాంటి సెటైర్లు ఊరకనే రావని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిజంగానే నిరూపించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో..జనసేన ఐటీ విభాగాన్ని ప్రారంభించారు. ఓ రాజకీయ పార్టీ ఐటీ విభాగం కూడా ఈ స్థాయిలో ఉంటుందా అని అందరూ ఆశ్చర్యపోయేలా దాన్ని ఏర్పాటు చేశారు. అందులో దాదాపుగా ఎనిమిది వందల మంది వలంటీర్లు షిప్ఠుల వారీగా పని చేస్తారట. వీరందర్నీ శతఘ్ని టీమ్‌గా పిలుస్తారు.

టీడీపీ, వైసీపీ.. ఇలా వ్యవస్థీకృతంగా ఇలాంటి ఏర్పాట్లు చేసుకోలేదు. తొలి సారి పవన్ కల్యాణ్ ఓ ఐటీ కంపెనీలా… జనసేన ఐటీ వింగ్‌ను నడపాలని నిర్ణయించుకున్నారు. ఓ రాజకీయ పార్టీ కోసం.. ఎనిమిది వందల మంది ఆన్‌లైన్ వర్క్ చేయడం ..అదీ కూడా అఫీసులో కూర్చుని అంటే.. మామూలు విషయం కాదు ప్రస్తుత కాలంలో ఆన్‌లైన్‌ రాజకీయాలకు.. చాలా ప్రాధాన్యం ఉంది కానీ.. అదంతా.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికే. ఇప్పుడు సోషల్ మీడియాలో తిరిగే న్యూస్‌ను నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు. ఆ స్థాయిలో అసత్యాలు, అర్థసత్యాలు, మార్ఫింగ్‌లు, ఫేక్‌ ఫోటోలతో సోషల్ మీడియా రాజకీయం భ్రష్టుపట్టిపోయింది. ఇందులో ఏ పార్టీ తక్కువ కాదు. కానీ పవన్ కల్యాణ్‌
ఆన్ లైన్ ప్రచారంపైనే తన పూర్తి దృష్టి కేంద్రీకరించినట్లు దీని ద్వారా అర్థమయిపోతోంది.

ఫేస్ బుక్ పోస్టులు.. ట్విట్టర్ షేర్లు… వాట్సాప్ సందేశాలు..ఎప్పటికీ ఓట్లు తెచ్చి పెట్టలేవు. అందులో ఎలాంటి సందేహం లేదు. తమకంటూ ఓ అభిప్రాయం ఏర్పర్చుకున్న వారు… ఎవరయినా వాదనకు దిగితే..మరింత బలంగా తమ వాదన వినిపిస్తారు కానీ… మెత్తబడే ప్రశ్నే ఉండదు. చివరికి ఘర్షణకు సైతం దారి తీస్తాయి. సోషల్ మీడియాలో రాజకీయ చర్చలు అలాంటి వాటికే దారి తీస్తాయి. జనసేన శతఘ్ని టీమ్‌లో ఎనిమిది వందల మంది ఏం చేస్తారంటే.. ఇలాంటి వాదనలనే ఇతర పార్టీల నేతలతో చేసే అవకాశం ఉంది. ఎందుకంటే.. పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఐటీ విభాగం మంచిదే కానీ.. దాన్నే నమ్ముకుని ఉంటే పవన్ కల్యాణ్‌కు నిరాశ తప్పదు. ముందుగా ప్రజల్ని నమ్ముకోవాలి.. ఆ తర్వాతే ఏదైనా..?

——–సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close