పాతిక సీట్ల కోసం టీడీపీ డ్రామాలాడుతోందట..! మరి బీజేపీ సీట్ల కోసం కాదా జీవీఎల్..?

తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో విపక్ష పార్టీల మద్దతు కూడగట్టుకోవడం కోసం.. దేశం మొత్తం తిరిగారు. తమిళనాడు నుంచి బీహార్ వరకు..అందుబాటులో ఉన్న కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలన్నింటినీ కలిశారు. పార్లమెంట్‌లో తాము చేయబోయే పోరాటానికి మద్దతు అడిగారు. అది వారు చేయాలనుకున్న పని. వారు చేస్తున్నారు. కానీ అది బీజేపీ ఎంపీ జీవీఎల్ నరిసింహారావుకు అస్సలు ఇష్టం లేకపోయింది. ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి.. ఎంపీలపై తన కసి అంతా.. తనకు మాత్రమే సాధ్యమైన తెలుగుభాషలో తీర్చుకున్నారు. ఎంపీలు విపక్ష పార్టీల నేతలను కలవడం డ్రామా అని తేల్చేశారు. కేవలం ఇరవై ఐదు సీట్ల కోసం.. ఎన్ని అబద్దాలైనా.. ఎన్ని డ్రామాలైనా ఆడతారంటూ.. ఎంపీలపై మండిపడ్డారు.

మరి బీజేపీ లోక్‌సభ సీట్ల కోసం కాదా… ఇప్పుడు కిందా మీదా పడుతోంది. ముందస్తు అని జమిలీ.. అనీ… హిందూముస్లిం.. అని రకరకాల విన్యాసాలు చేస్తోంది… సీట్ల కోసం కాదా..? నడిచేది తను కాకపోతే.. ఢిల్లీ కూడా దగ్గరే అనే రకం జీవీఎల్ . తమకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీ… పోరాటాలు చేస్తే… అది డ్రామా.. అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం…. ఏం చేసినా.. రాజకీయం కాదు. ప్రజల కోసమే చేస్తుంది. ఇది జీవీఎల్ సిద్దాంతం. అదే నిజం అయితే.. డ్రామాలేసుకునేవాళ్లు డ్రామాలేసుకుంటారు…! వారికి పోటీగా జీవీఎల్ ప్రెస్‌మీట్‌లు పెట్టి సహనం కోల్పోవడం ఎందుకు..?

తెలుగుదేశం పార్టీ ఎంపీల విషయ పరిజ్ఞానంపై కూడా.. జీవీఎల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలకు అసలు ఏమీ తెలియదని తేల్చేశారు. తెలిసిన వారికీ చెప్పొచ్చు.. తెలియని వారికీ చెప్పొచ్చు.. తెలిసి తెలియని వారికి ఏం చెప్పినా వినిపించకోరని.. అంటారు. జీవీఎల్ కూడా ఇదే స్టైల్. తనకు తెలిసింది మాత్రమే నిజం అనుకుంటారు. బీజేపీకి ఏది అనుకులమైతే..అంత వరకూ తెలుసుకుంటారు. మిగతా తెలిసినా తెలియనట్లు నటిస్తారు. జీవీఎల్ విషయ పరిజ్ఞానం ఎంతో.. కుటుంబరావు.. టీవీ చర్చల్లో ఎన్నో సార్లు బయటపెట్టారు. అయినా జీవీఎల్ అదే అంశంపై టీడీపీ నేతల్ని తప్పు పట్టేశారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు..విపక్ష పార్టీలను కలవడం.. వారి మద్దతును పొందడం … భరించలేకే.. విమర్శలు చేసినట్లున్నారు జీవీఎల్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

నిరాసక్తంగా జగన్ ప్రచారం – ఆశలు వదిలేసుకున్నట్లే !

ఏపీ సీఎం జగన్ ప్రచారానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రెండు, మూడు రోజులకో సారి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమవుతున్నారు. ప్రచార సభల్ని పరిమితం చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close