ప్రత్యేకహోదాపై కాంగ్రెస్‌ కూడా డబుల్‌ గేమ్ ఆడుతోందా..?

ప్రత్యేకహోదా అంశాన్ని రాజకీయంగా… వాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా.. ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేకహోదా అంశానికి కాంగ్రెస్ పార్టీ చాలా రోజులు క్రితమే బేషరతుగా మద్దతు ప్రకటించింది. ప్రకటించకపోవడానికి కూడా అవకాశమే లేదు. ఎందుంటే.. విభజనతో కట్టుబట్టలతో మిగిలిపోయే ఆంధ్రప్రదేశ్‌కి అంతో ఇంతో అండగా ఉండటానికి కాంగ్రెస్ పార్టీనే ప్రత్యేకహోదాను ప్రకటించింది. ఇప్పుడు తాము ఇవ్వలేము అంటే… ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు.. దేశం మొత్తం అసహ్యించుకునే ప్రమాదం ఉంది. అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేకహోదా ఫైలుపైనే రాహుల్ గాంధీ పెడతారని.. ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి చెబుతున్నారు. అదే సమయంలో కొద్ది రోజుల క్రితం జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో తీర్మానం కూడా చేశారు. నిన్న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సమావేశంలోనూ మళ్లీ నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని తేల్చేశారు. నిజంగా ఏపీ ప్రజలకు ఊరటనిచ్చే అంశమే.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా నిరాకరించడానికి ప్రత్యేకమైన కారణాలేమీ లేకపోయినా.. బీజేపీ.. పధ్నాలుగో ఆర్థిక సంఘం నిబంధనలను తనకు ఇష్టం వచ్చినట్లు అన్వయించుకుని ఇవ్వనని తేల్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తానంటోంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారలో ఉండి ఉంటే..ఏం జరిగిదో మనం ఊహించలేము. కానీ.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు… అధికార పార్టీ చేయలేని దాన్ని చేసి చూపిస్తామని చెప్పడం ద్వారా అధికారంలోకి వస్తాయి. దానికి బీజేపీనే పెద్ద ఉదాహరణ… నల్లధనం నుంచి.. అవినీతి పరులకు శిక్షల వరకూ చాలా చెప్పారు. ఒక్కటంటే.. ఒక్కటి కూడా అమలు చేయలేదు. అన్నింటినీ “జుమ్లా”లుగా తేల్చారు. మరి మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఇలానే చేయదని గ్యారంటీ ఏమిటి..?

ఈ అనుమానాలు ప్రారంభమవడానికి కూడా కాంగ్రెస్ నేతలే అవకాశాలు కల్పించారు. విభజన హామీలపై జరిగిన మోసాన్ని పార్లమెంట్ సాక్షిగా నిలదీయాలని తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెట్టింది. అందులో రాహుల్ గాంధీ చాలా మాట్లాడారు. గల్లా జయదేవ్ ప్రసంగం ఏపీ ప్రజల ఆవేదనను బయట పెట్టిందన్నారు. కానీ ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని ఎందుకు డిమాండ్ చేయలేదు..? పార్లమెంట్ సాక్షిగా..మన్మోహన్ ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం.. ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని ఎందుకు నిలదీయలేదు..? అసలు ప్రత్యేకహోదా గురించి ఒక్క మాట కూడా.. రాహుల్ ఎందుకు మాట్లాడలేదు..? ఈ అనుమానాలన్నీ సగటు ఆంధ్రుడికి వస్తున్నాయి.

విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్, బీజేపీ సంయుక్తంగా చెప్పుకొచ్చాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ యూటర్న్ తీసుకుంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మేము వచ్చాకా ఇస్తామంటోంది. ప్రజలకు మరో ఆప్షన్ లేదు. అసలు గొంతు కోసిన పార్టీ అయినా.. ఇస్తామన్న కాంగ్రెస్‌పైనే బీజేపీ కన్నా ఎక్కువగా సానుభూతి చూపిస్తారు. కానీ ఏపీలో తమకేమీ లేదన్న నిర్లక్ష్యాన్ని పీఠం అందుకున్న తర్వాత చేయరన్న గ్యారంటీ ఏమిటి..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close