డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన “చిక్కి నావే నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్ లా” పాట గాయకుడు

రాహుల్ సిప్లిగంజ్ టాలీవుడ్లో గాయకుడు. చలో, రంగస్థలం, జోష్ ,దమ్ము ,రచ్చ లాంటి ఎన్నో సినిమాల్లో పాటలు పాడిన ఈ గాయకుడు నిన్న డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి పోలీసుల వద్ద “రచ్చ” చేశాడు. ఈయనతో పాటు యాంకర్ లోబో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడు. వీళ్ళిద్దరూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో కాస్త రచ్చ జరిగింది. అయితే ఆ వాగ్వాదానికి చెందిన వీడియోలు మీడియాలో దర్శనమివ్వడంతో ఇద్దరు పరువు పోగొట్టుకున్నారు. అయితే రాహుల్ వద్ద డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకపోవడం ఇక్కడ గమనార్హం.

మరొక సంగతి ఏమిటంటే గతంలో “చలో” అనే సినిమాలో ఈ గాయకుడు ఒక పాట పాడాడు. హీరోయిన్ ని ఉద్దేశించి హీరో ,”టెక్కు లాపవే, టెక్కు లాపవే, చిక్కి నావే నువ్వు డ్రంక్ అండ్ డ్రైవింగ్ లా” అనే ఆ పాట బాగా పాపులర్ అయింది కూడా ‌ అయితే ఇప్పుడు అదే పాట ఆ పాడిన గాయకుడు కి వర్తిస్తుంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన తర్వాత కూడా పోలీసుల వద్ద టెక్కు చూపించబోయి బుక్కయ్యాడు ఈ సింగర్. ఇక యాంకర్ లోబో కూడా మ్యూజిక్ ఛానల్స్ చూసేవారికి సుపరిచితులే. విచిత్రమైన డ్రెస్సింగ్ తో హైదరాబాద్ ఉర్దూ మిక్స్డ్ తెలుగు లో మాట్లాడుతూ సరదాగా వ్యాఖ్యానాలు చేసే లోబో కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో నిన్న పట్టుబడ్డాడు.

ఏదిఏమైనా సెలబ్రిటీలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడటం ఈ మధ్య కాస్త ఎక్కువైంది. కనీసం ఇకముందైనా సెలబ్రిటీలు కాస్త జాగ్రత్త పడతారేమో చూడాలి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close