రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రేస్..! బీజేపీకి శివసేన, అకాలీ షాక్..!!

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీఏ తరపున జేడీయూ ఎంపీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ సన్నిహితుడు హరివంశ్‌ను నిలబెట్టాలని బీజేపీ అగ్రనేతలు నిర్ణయించారు. హరివంశ్ కోసం… బీహార్ సీఎం రంగంలోకి దిగారు. ఎన్డీఏ బయటి పార్టీల మద్దకు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఫోన్ చేశారు. హరివంశ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. కేసీఆర్ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని సమాధానం ఇచ్చారు. మరో వైపు జేడీయూ ఎంపీని ఎన్డీఏ తరపున నిలబెట్టాలని నిర్ణయించడం ఆ కూటమిలోని డు ప్రధాన భాగస్వామ్య పక్షాలైన.. అకాలీదళ్, శివసేనకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆ రెండు పార్టీలు ఓటింగ్‌కు దూరంగా ఉండాలని దాదాపుగా నిర్ణయించుకున్నాయి.

అకాలీదళ్ ఎంపీ నరేష్ గుజ్రాల్‌కు అవకాశం వస్తుందని బీజేపీ వర్గాలు చాలా కాలంగా చెబుతూ వస్తున్నాయి. కానీ హఠాత్తుగా మాటమాత్రంగా కూడా చెప్పకుండా.. హరివంశ్‌ను ఖరారు చేయడంతో అకాలీదళ్ అసంతృప్తికి గురయిది. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని డిసైడయింది. ఇక శివసేన బీజేపీతో చాలా కాలంగా విబేధిస్తోంది. హరివంశ్ విషయంలోనూ సంతృప్తిగా లేదు. టీడీపీ పెట్టిన అవిశ్వాసం విషయంలోనూ.. బీజేపీకి శివసేన షాక్ ఇచ్చింది. మద్దతుగా ఓటేయడానికి అంగీకరించలేదు. రెండు పార్టీలకు కలిపి రాజ్యసభలో ఆరుగురు ఎంపీలు ఉన్నారు. వీరు కూడా ఓటింగ్‌కు దూరం అయితే.. బీజేపీకి ఇబ్బందికర పరిస్థితే ఎదురవుతుంది.

నాన్ బీజేపీ అభ్యర్థిగా.. తమ పార్టీ ఎంపీని ప్రమోట్ చేయాడనికి జేడీయూ నేత నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. పరోక్షంగా బీజేపీకి సహకరిస్తున్న అన్నాడీఎంకే, వైసీపీ, బీజేడీ, టీఆర్ఎస్‌ల మద్దతు లభిస్తుందని ఆశ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల తరపున ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలన్నది .. ఖరారు చేయడానికి మరోసారి పార్టీలన్నీ సమావేశం కాబోతున్నాయి. ఈ రెండు కూటములలో లేకుండా.. ఉన్న పార్టీలకు దాదాపుగా 30 మంది రాజ్యసభ సభ్యులున్నారు. వాళ్లే ఫలితాన్ని నిర్ణయించబోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close