దేవ‌దాస్ ఫ‌స్ట్ లుక్‌: బాబులు బాగా తాగి బొజ్జున్నారు

నాగార్జున‌, నాని క‌ల‌సి న‌టిస్తున్నారన‌గానే ఆస‌క్తి మొద‌లైపోయింది. పైగా టైటిల్ `దేవ‌దాస్‌`. ఊహ‌లు, అంచ‌నాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు ఫ‌స్ట్ లుక్ వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కూ చూసిన స్టార్ హీరోల ఫ‌స్ట్‌లుక్కుల‌తో పోలిస్తే… ఇది కాస్త డిఫ‌రెంట్‌గా ఉంది. దేవ్‌, దాస్ ఇద్ద‌రూ క‌ల‌సి, పీక‌ల్దాకా తాగి.. బొజ్జున్న పోస్ట‌ర్ అది. దేవ్ చేతిలి మందు బాటిల్‌, పిస్ట‌ల్‌, దాస్ మెడ‌లో సెత‌స్కోప్‌… టైటిల్‌కీ వాళ్ల పాత్ర‌ల‌కు న్యాయం చేశాయి. ఫ‌స్ట్ లుక్ ఫ‌న్నీగా ఉంది. `ఇంకా దిగి ఉండ‌దు వీళ్ల‌కు. ఒక్క‌సారి లేచారంటే అల్ల‌రే అల్ల‌రి` అంటూ ఈ ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేశారు. వేక‌ప్ ఆన్ 27 సెప్టెంబ‌రు అంటూ… విడుద‌ల తేదీ చెప్పేశారు. ఈ సినిమా కాస్త డిఫ‌రెంట్‌గా ఉండ‌బోతోంద‌ని ఫ‌స్ట్ లుక్ చూస్తే అర్థ‌మైపోతోంది. సినిమాలో కూడా ఇంతే ఫ‌న్ ఉంటే.. త‌ప్ప‌కుండా బాక్సాఫీసు ద‌గ్గ‌ర నిల‌బ‌డిపోతుంది. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు. అకాంక్ష సింగ్‌, ర‌ష్మిక క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close