జగన్ రెడ్డి తాను అడ్డంగా దొరికిపోయిన కేసులో చంద్రబాబుపైన ఎంతో కొంత బురదచల్లి సమం చేయాలని చాలా ప్రయత్నిస్తున్నారు. అందు కోసం ఆవు కథలు.. పిట్టకథలు.. ఇండియా మార్ట్ స్టోరీలు .. సజ్జల చేత రాయించుకొచ్చి చదివేస్తున్నారు. గురువారం గంటల తరబడి పెట్టిన ప్రెస్మీట్లో బడ్జెట్ విశ్లేషణ తర్వాత హెరిటేజ్ కంపెనీకి నెయ్యి మరక అంటించేందుకు.. చిత్ర విచిత్రమైన హావభావాలతో ఆయన చెప్పిన కథలు విన్నవారెవరైనా.. జగన్ రెడ్డి ఇంత అమాయకుడా.. లేకపోతే జనాన్ని అంత అమాయకులనుకుంటున్నారా అని ఆశ్చర్యపోవడం ఖాయం.
భోలేబాబా డెయిరీతో హెరిటేజ్ కు సంబందం ఉందని.. ఇండియా మార్ట్ అనే వెబ్ సైట్ లో ఉందట. అంత కంటే తిరుగులేని సాక్ష్యం ఏం కావాలని ఆయన దాన్నే స్క్రీన్ షాట్ తీసుకొచ్చారు. ఇండియా మార్ట్ అనేది ఓ మార్కెటింగ్ సైట్.. ఓ పేజీ క్రియేట్ చేసుకుని ఎవరైనా ఏదైనా రాసుకొవచ్చు. అంత మాత్రాన .. ఆ కంపెనీ వారిదైపోతుందా..? . ఆ కామన్ సెన్స్ జగన్ కు లేదని కాదు..కానీ ఏదో ఓ లింక్ చూపించాలి కాబట్టి దాన్ని చూపించారు.
ఇక ఇందాపూర్ విషయంలోనూ అంతే. ఇందాపూర్ నుంచి చీజ్ విషయంలో సహ ఉత్పత్తిదారు అని హెరిటేజ్ స్వయంగా ప్రకటించింది. చీజ్ ఉత్పత్తులపై ఇందాపూర్ పేరు కూడా ఉంటుంది. అదేదో కొత్త విషయం అయినట్లుగా.. అలా చీజ్ సహ ఉత్పత్తిలో భాగం అయితే ఆ కంపెనీ హెరిటేజ్ దే అని జగన్ వాదిస్తారు. ఆ కంపెనీకి కొంత నెయ్యి కాంట్రాక్ట్ వస్తే..హెరిటేజ్ కు వచ్చిందంటారు.
నిజానికి అంత పెద్ద కంపెనీ హెరిటేజ్ ది అయితే ఘనంగా చెప్పుకుని స్టాక్ మార్కెట్ లో ఇంకా దూసుకెళ్తుంది. సోనాయ్ గ్రూపుకు చెందిన ఇందాపూర్ నుంచి అమూల్ కూడా ఉత్పత్తులు కొంటుంది. ఇదంతా జనానికి తెలియదని జగన్ అనుకుంటున్నారు. ఓ తప్పుడు పనిని సమర్థించుకోలేక.. ఆ తప్పుడు పనిని రాజకీయ ప్రత్యర్థుల మీద తోసేసేందుకు దేనికైనా తెగబడే మనస్థత్వం జగన్ రెడ్డి ప్రెస్మీట్లో కనిపించింది.
స్టాక్ మార్కెట్ లో.. స్పష్టమైన వివరాలు ఉంటాయి. హెరిటేజ్ లిమిటెడ్ కంపెనీ. ఏ కంపెనీతో అనుబంధం ఉన్నా స్టాక్ మార్కెట్ కు చెబుతారు. జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తూ.. ఘోరమైన రాజకీయం చేస్తున్నారు.
