గాయ‌కుల హ‌క్కుల‌పై బాలు గ‌ళం

దేశంలోని గాయ‌కులంతా ఏక‌మ‌వ్వబోతున్నారు. త‌మ హ‌క్కుల కోసం పోరాటం చేయ‌బోతున్నారు. దానికి ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం నాయ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. టీవీ ఛాన‌ళ్ల‌లో, ఎఫ్.ఎమ్‌ల‌లో విరివిగా పాట‌లు వ‌స్తుంటాయి. అలా వాడుకుంటున్న ప్రతీ పాట‌కూ.. గీత ర‌చ‌యిత‌కు, సంగీత ద‌ర్శ‌కుడికి కొంత పారితోషికాన్ని చెల్లిస్తారు. పాట పాడిన గాయ‌కుడికి ఎలాంటి క్రెడిటూ ద‌క్క‌డం లేదు. ఈ విష‌య‌మై.. చాలాకాలం నుంచి గాయ‌కులు పోరాడుతూనే ఉన్నారు. కానీ ఫ‌లితం ద‌క్క‌లేదు. అందుకే ఇప్పుడు గాయ‌కులంతా ఏక‌మ‌వ్వ‌బోతున్నారు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌రాఠీ, హిందీ.. ఇలా అన్ని భాష‌ల గాయ‌కులూ క‌ల‌సి ఓ అసోసియేష‌న్ ఏర్పాటు చేసుకున్నారు. అందుకు సంబంధించిన విధివిధానాల‌ను ఈ రోజు హైద‌రాబాద్‌లో జ‌రిగే కార్య‌క్ర‌మంలో మీడియా ముందు ఉంచ‌బోతున్నారు. పాట రాసిన గీత ర‌చ‌యిత‌కు,స్వ‌ర ప‌రిచిన సంగీత ద‌ర్శ‌కుడికీ, పాడిన గాయ‌కుడికీ క్రెడిట్ ఇస్తే… మ‌రి నిర్మాత సంగ‌తేంట‌న్న‌ది ముందు నుంచీ ఎదుర‌వుతున్న ప్ర‌శ్నే. ఈ లావాదేవీల‌లో ఆడియో కంపెనీలు ఎక్కువ లాభ‌ప‌డుతున్నాయ‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పాట‌తో సంబంధం ఉన్న వాళ్లంద‌రికీ పారితోషికాలు వ‌స్తున్న‌ప్పుడు.. ఆ పాటకు మూల‌కార‌ణ‌మైన నిర్మాత‌కు కూడా ఎంతో కొంత ఇవ్వాల్సిందే క‌దా? మ‌రి దీనిపై పోరాటం ఎప్పుడు మొద‌ల‌వుతుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close