‘గూఢ‌చారి’ రాయ‌బారి.. నాగ్‌

చిల‌సౌ, గూఢ‌చారి రెండూ ఒకేరోజు విడుద‌ల‌య్యాయి. స‌మీక్ష‌లు రెండి సినిమాల‌కూ మంచి రేటింగులే ఇచ్చాయి. జ‌నాలు మాత్రం గూఢ‌చారికి ప‌ట్టం క‌ట్టారు. సెల‌బ్రెటీలు కూడా ఈసినిమా గురించే మాట్లాడుతున్నారు. చిల‌సౌ అన్న‌పూర్ణ సంస్థ నుంచి విడుద‌లైంది. అయినా స‌రే.. నాగ్ కూడా గూఢ‌చారి వైపే ఉన్నాడు. ఈ సినిమాని మెచ్చుకుంటూ ట్వీట్ చేసిన నాగ్‌.. ఇప్పుడు స‌క్సెస్ మీట్‌కి కూడా హాజ‌ర‌వుతున్నాడు. ఈరోజు సాయింత్రం హైద‌రాబాద్‌లో ‘గూఢ‌చారి’ స‌క్సెస్ మీట్ జ‌ర‌గ‌బోతోంది. దీనికి నాగార్జున ముఖ్య అతిథిగా వ‌స్తున్నాడు. త‌న సంస్థ‌కు పోటీగా ఓ సినిమా వ‌స్తే, దాన్ని మెచ్చుకోవ‌డ‌మే కాకుండా, ఇలా.. స‌క్సెస్ మీట్‌కీ రావ‌డం… నాగ్ గొప్ప‌ద‌నానికి నిదర్శ‌నం. ఓ ర‌కంగా ‘గూఢ‌చారి’కి నాగ్ రాయ‌బారిగా మారిపోయిన‌ట్టే. మ‌హేష్‌బాబుతో పాటు టాలీవుడ్ స్టార్లు, ద‌ర్శ‌కులు ‘గూఢ‌చారి’ని ఆకాశాన్ని ఎత్తేస్తున్నారు. ఇవ‌న్నీ ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌కు బాగా స‌హ‌క‌రిస్తున్నాయి. దాంతో సోమ‌, మంగ‌ళ‌వారాల వ‌సూళ్లు కూడా ఆశాజ‌న‌కంగా సాగాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌థ‌లు వింటున్న త్రివిక్ర‌మ్‌

స్వ‌త‌హాగా త్రివిక్ర‌మ్ మంచి ర‌చ‌యిత‌. ఆ త‌ర‌వాతే ద‌ర్శ‌కుడ‌య్యాడు. త‌న క‌థ‌ల‌తోనే సినిమాలు తీశాడు. తీస్తున్నాడు. `అ.ఆ` కోసం ఓ న‌వ‌ల ని ఎంచుకున్నాడు. ర‌చ‌యిత్రికి కూడా క్రెడిట్స్ ఇచ్చాడు. అయితే.. క‌థ‌ల...

ఆత్మ‌క‌థ రాస్తున్న బ్ర‌హ్మానందం

అరగుండుగా `అహ‌నా పెళ్లంట‌`లో న‌వ్వించాడు బ్ర‌హ్మానందం. అది మొద‌లు.. ఇప్ప‌టి వ‌ర‌కూ వంద‌లాది చిత్రాల్లో హాస్య పాత్ర‌లు పోషించి, తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. ప‌ద్మ‌శ్రీ‌తో ప్ర‌భుత్వం...

క‌మ్ బ్యాక్ కోసం నిత్య‌మీన‌న్ ఆరాటం

అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్పుడే ఒడిసిప‌ట్టుకోవాలి. అవి చేజారిపోయాక‌.. ఆరాట‌ప‌డ‌డంలో అర్థం లేదు. చిత్ర‌సీమలో అవ‌కాశ‌మే గొప్ప‌ది. దాన్ని ఎంత వ‌ర‌కూ స‌ద్వినియోగం చేసుకుంటామ‌నే విష‌యంపైనే కెరీర్ ఆధార‌ప‌డి ఉంటుంది. ఆ సంగ‌తి నిత్య‌మీన‌న్‌కి ఇప్పుడిప్పుడే...

గీతా ఆర్ట్స్‌లో వైష్ణ‌వ్ తేజ్‌

గీతా ఆర్ట్స్‌కీ, మెగా హీరోల‌కూ ఓ సెంటిమెంట్ ఉంది. తొలి సినిమాని బ‌య‌టి బ్యాన‌ర్‌లో చేయించి, రెండో సినిమా కి మాత్రం గీతా ఆర్ట్స్ లో లాక్ చేస్తుంటారు. రామ్ చ‌ర‌ణ్ అంతే....

HOT NEWS

[X] Close
[X] Close