దేవుడి టైటిల్స్‌ దిల్‌రాజుకి కలిసి రావడం లేదా?

హిట్‌ సినిమాల నిర్మాత దిల్‌రాజు ఏడుకొండల వేంకటేశ్వరుని భక్తుడు. ఇష్టదైవం పేరుతో వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థని స్థాపించారు. పట్టిందల్లా బంగారమే అన్నట్టు అంతా కలిసి వచ్చింది. నిర్మాతగా సక్సెస్‌ రేషియో బావుంది. ఆయన నిర్మించిన సినిమాల్లో ఎక్కువశాతం హిట్టే. మధ్యలో అప్పుడప్పుడూ కొన్ని ఫ్లాపులు వచ్చాయి. ఫ్లాపుల్లో ప్రముఖంగా చెప్పుకోవలసిన సినిమా ‘కృష్ణాష్టమి’. సునీల్‌ హీరోగా వాసువర్మ దర్శకత్వంలో నిర్మించారు. కృష్ణుడి పేరు, పండగ కలిసి వచ్చేలా టైటిల్‌ పెట్టారు. హిట్‌ కాలేదు. నిర్మాతగా అంతకు ముందు దేవుడి పేర్లతో దిల్‌రాజు నిర్మించిన సినిమా ‘రామరామ కృష్ణకృష్ణ’. ఈ టైటిల్‌ ఇద్దరు దేవుళ్ళు రాముడు, కృష్ణుడు వున్నారు. ఆ సినిమాలో హీరో రామ్‌. అతడిదీ దేవుడి పేరే. కానీ, సినిమా హిట్‌ కాలేదు. కమర్షియల్‌ ఫార్మాట్‌లో తీసిన ఈ సినిమా కమర్షియల్‌గా వర్కవుట్‌ కాలేదు. ఇష్టదైవం వెంకటేశ్వరుని నామం వచ్చేలా టైటిల్‌ పెట్టిన సినిమా ‘శ్రీనివాస కల్యాణం’. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరికి నచ్చింది. కొందరికి నచ్చలేదు. పండగ సీజన్‌లో వచ్చుంటే పెద్ద హిట్టయ్యే సినిమా అని చాలామంది నోట వినిపిస్తోన్న మాట. కమర్షియల్‌గా ఏ రేంజ్‌ హిట్‌ అనేది పక్కన పెడితే… అందర్నీ సినిమా ఆకట్టుకోలేదనేది మాత్రం వాస్తవం! ఈ మూడు సినిమాల ఫలితాల్ని, వాటికి వచ్చిన స్పందనని గమనిస్తే… దిల్‌రాజుకి టైటిల్స్‌లో దేవుడి పేర్లు పెడితే కలిసి రావడం లేదా? అనే ఆలోచన కలుగుతోంది. మొత్తానికి దేవుడి టైటిల్స్‌తో దిల్‌రాజుకి దెబ్బలే తగిలాయన్నది టాపిక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close