తెలంగాణలో ముందస్తు..! రాజకీయ భాషలో చెప్పిన కేసీఆర్..!!

ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని స్పష్టంగా ప్రకటించారు. వచ్చే ఆరేడు నెలల్లో ఎన్నికలు జరిగినా.. అవి ముందస్తు కాదంటున్నారు. హైదరాబాద్‌లో అత్యవసరంగా టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం నిర్వహించిన ఆయన … పార్టీ శ్రేణులకు ఎన్నికలకు సిద్దం కావాలని.. పరోక్షంగా అయినా గట్టి సంకేతాలే పంపారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారని కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రెండు నెలల క్రితం ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమైనప్పటి నుంచి ఆయన ఎన్నికల సన్నాహాల్లోనే ఉన్నారు. నియోజకవర్గాల వారీగా… ఫామ్‌హౌస్‌లో కసరత్తు పూర్తి చేశారు. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. ఇన్‌ డైరక్ట్‌గా పని చేసుకోమని.. ఆయా ఆభ్యర్థులను పిలిచి చెప్పారు కూడా. ఇప్పుడు దానికి సంబంధించి తుది కసరత్తు కూడా పూర్తి చేశారు.

నవంబర్, డిసెంబర్‌లలో జరగాల్సి ఉన్న మూడు రాష్ట్రాల ఎన్నికలతో పాటే.. తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. సెప్టెంబర్‌లో అభ్యర్థులందర్నీ ప్రకటిస్తాననన్నారు. అదే సెప్టెంబర్‌లో ఇరవై ఐదు లక్షల మందితో హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహిస్తామన్నారు. బహుశా అదే వేదికగా… అసెంబ్లీ రద్దు చేసి.. ముందస్తుకు వెళ్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. కేసీఆర్ రాజకీయ వ్యూహాలు అనుహ్యంగా ఉంటాయి. సహజంగా.. తెలంగాణలో పార్లమెంట్‌తో పాటు జమిలీ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సి ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జమిలీకి వెళ్లే ఆలోచన ఉందో లేదో క్లారిటీ రావడం లేదు. ఒక వేళ కేంద్రం సిద్దంగా లేకపోయినా.. తాను మాత్రం ముందుకే వెళ్లాలనుకుంటున్నారు కేసీఆర్. దానికి రెండు మూడు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. రాష్ట్ర అంశాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. తాము బీజేపీతో సఖ్యతగా ఉంటున్న వ్యవహారం పెద్దగా ముస్లింలలోకి వెళ్లదు. ఎందుకంటే.. తెలంగాణలో బీజేపీని ఆయన పూచికపుల్లలా తీసి పారేస్తారు. అతే పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మాత్రం.. బీజేపీతో టీఆర్ఎస్ సంబంధాలు హైలెట్ అవుతాయి. అలా అవ్వడం ముస్లిం ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు సమీకృతమవుతుంది. అందుకే పార్లమెంట్‌తో కన్నా.. అసెంబ్లీకి విడిగా ఎన్నికలుక వెళ్లడం మంచిదని భావిస్తున్నారు. దాని ప్రకారమే నిర్ణయం తీసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close