‘సైరా’ బడ్జెట్ = ‘ఖైదీ నంబర్ 150’ కలెక్షన్స్ × 2!

‘సైరా’ బడ్జెట్ ఎంత? టీజ‌ర్ విడుద‌ల‌ కార్యక్రమంలో ఈ ప్రశ్నకు రామ్‌చ‌ర‌ణ్‌ సూటిగా సమాధానం చెప్పలేదు. “నాన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. కాబట్టి ఖర్చుకి వెనుకా ముందూ చూడట్లేదు. భారీగా తీస్తున్నాం. లాభాలు వస్తే బోనస్. రాకున్నా ఆనందమే. (‘మగధీర’ చూశాక..) నాన్నగారు నాతో ‘నీ (చరణ్)మీద నాకు ఏదైనా ఈర్ష్య వుందంటే.. రెండో సినిమాకి సోషియో ఫాంటసీ కాస్ట్యూమ్ డ్రామా చేశావ్. 35 ఏళ్లలో 150 సినిమాలు చేశా. నాకు ఒక్క సోషియో ఫాంటసీ కాస్ట్యూమ్ డ్రామా లేదురా’ అన్నారు. ఆయన కోరికకు సమాధానమే ఈ సినిమా. నాన్న కలను నిజం చేస్తున్నా” అని రామ్‌చ‌ర‌ణ్‌ చెప్పాడు.

అల్లు అర్జున్ మాత్రం ‘సైరా’ బడ్జెట్ ఎంతో బయటపెట్టాడు. అభిమానుల నడుమ జరిగిన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో ‘సైరా’ బడ్జెట్ గురించి బన్నీ మాట్లాడాడు. “చిరంజీవిగారి 150వ సినిమా (ఖైదీ నంబర్ 150) ఎంత కలెక్ట్ చేసిందో… దానికి రెండురెట్లు ఈ సినిమా (సైరా) బడ్జెట్ వుంటుంది. ఖర్చుకు వెనుకాడకుండా అంత భారీగా తీస్తున్నందుకు నిర్మాత రామ్‌చ‌ర‌ణ్‌ని అభినందిస్తున్నా” అని అల్లు అర్జున్ చెప్పాడు. ‘ఖైదీ నంబర్ 150’ సినిమా 100 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. అల్లు అర్జున్ మాటలను బట్టి ‘సైరా’ బడ్జెట్ 200 కోట్ల రూపాయలు అనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుకుమార్ కుమార్తెకు దాదా ఫాల్కే అవార్డ్

డైరెక్టర్ సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి సినీ రంగప్రవేశం చేసింది. ఆమె ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ఈ చిత్రాన్ని గ‌తంలో ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్రద‌ర్శించారు....

టీంమిండియాకి ‘ముంబై ఇండియన్స్’ కలవరం

కొత్త కుర్రాళ్ళతో టీ20 ప్రపంచకప్ బరిలో దిగుతుందని భావించిన భారత క్రికెట్ జట్టు.. అనూహ్యంగా సీనియర్లతోనే సరిపెట్టుకుంది. 2022 టీ20 ప్రపంచకప్‌లో పోటీపడిన జట్టులో ఎనిమిది మందికి మరోసారి అవకాశం వచ్చిందంటే.. ఈ...

‘లాపతా లేడీస్’ రివ్యూ: దారితప్పి మార్గం చూపిన పెళ్లి కూతుళ్ళు

'ధోబీ ఘాట్' లాంటి విలక్షణమైన సినిమా తీసిన కిరణ్ రావు, దాదాపు దశాబ్ద విరామం తర్వాత 'లాపతా లేడీస్' కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టుకున్నారు. ఆమె దర్శకత్వంలో అమీర్ ఖాన్ నిర్మించిన ఈ...

టాలీవుడ్‌ ‘మే’ల్కొంటుందా?

2024 క్యాలెండ‌ర్‌లో నాలుగు నెల‌లు గ‌డిచిపోయాయి. ఈ వ్య‌వ‌ధిలో తెలుగు చిత్ర‌సీమ చూసింది అరకొర విజ‌యాలే. ఏప్రిల్ అయితే... డిజాస్ట‌ర్ల‌కు నెల‌వుగా మారింది. మే 13తో ఏపీలో ఎన్నిక‌ల హంగామా ముగుస్తుంది. ఆ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close