తెలంగాణలో టీడీపీ బహిరంగ సభలు..!

తెలంగాణ‌లో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయాల‌నే అంశంపై నేత‌ల‌తో టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు చ‌ర్చించారు. పార్టీలో స‌రైన నాయ‌కులు ప్ర‌స్తుతం లేక‌పోయినా, క్షేత్ర‌స్థాయిలో కేడ‌ర్ బ‌లంగా ఉంద‌నే అభిప్రాయాన్ని ఆయన వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. అంతేకాదు, తెలంగాణ‌లో పార్టీకి పూర్వ వైభ‌వం ఎలా తీసుకురావాలీ, ఉన్న స‌మ‌స్య‌ల్ని ఎలా ప‌రిష్క‌రించాల‌నేది త‌న‌కు తెలుసున‌ని చంద్ర‌బాబు నాయుడు వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం. రాష్ట్రంలో త్వ‌ర‌లోనే ఓ ఐదు భారీ బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించాల‌నే ప్ర‌తిపాద‌న ఈ స‌మావేశంలో వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

తెలంగాణ టీడీపీ నేత‌ల‌తో త్వ‌ర‌లోనే చ‌ర్చిస్తాన‌నీ, అక్క‌డి పార్టీ ప‌రిస్థితుల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటాన‌ని కూడా చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డ్డ‌ట్టు స‌మాచారం. ముందుగా టీ టీడీపీ నేత‌ల‌తో త్వ‌ర‌లోనే భేటీ అవుతాన‌న్నారు. ఈ మ‌ధ్య కేసీఆర్ స‌ర్కారు అనుస‌రిస్తున్న వైఖ‌రి వ‌ల్ల టీడీపీకి కొంత సానుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయ‌నే అభిప్రాయాన్ని ఈ స‌మావేశంలో ఒక నాయ‌కుడు చెప్పారు. ప్ర‌త్యేక హోదా, ఏపీ విభ‌జ‌న హామీల అంశంమై జాతీయ స్థాయిలో టీడీపీ పోరాటం చేస్తుంటే… తెరాస ఎంపీలు అనుస‌రించిన వైఖ‌రి తెలిసిందే. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడు అది త‌మ‌కు అవ‌స‌రం లేని వ్య‌వ‌హారంగా ఆ పార్టీ ఎంపీలు వ్య‌వ‌హ‌రించ‌డం వంటి ప‌రిణామాల‌ను తెలంగాణ‌లోని సీమాంధ్రులు క్షుణ్ణంగా గ‌మనించార‌నీ, రాష్ట్రంలో టీడీపీకి అనుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌నే విశ్లేష‌ణ జ‌రిగిన‌ట్టు స‌మాచారం.

తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏయే పార్టీల‌తో స‌ర్దుబాటు చేసుకోవాలి, పొత్తులు ఎలా ఉండాల‌నే అంశంపై కూడా నేత‌లు త‌మ అభిప్రాయాల‌ను చంద్ర‌బాబుతో పంచుకున్నారు. పొత్తుపై కూడా త్వ‌ర‌లోనే ఒక స్ప‌ష్ట‌మైన విధానాన్ని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. స‌రైన స‌మ‌యంలో స‌రైన చ‌ర్చ‌కే చంద్ర‌బాబు తెర లేపార‌ని చెప్పుకోవాలి. ఎందుకంటే, తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి ఏంట‌నేది ఉన్న ఆ కొద్దిమంది నేత‌ల‌కు కూడా అర్థం కానట్టు త‌యారైంది. క్షేత్ర‌స్థాయిలో పార్టీకి కొంత గ్రిప్ ఉన్న‌మాట వాస్త‌వ‌మే. కానీ, ఆ స్థాయిలో స‌మ‌న్వ‌యం చేసే నాయ‌కులు ఎవ‌రున్నార‌నేదే పెద్ద ప్ర‌శ్న‌. తెలంగాణ‌లో టీడీపీకి కొంత‌మంది నేత‌ల అవ‌స‌రం కూడా ఉంది! ఈ దిశ‌గా ద్వితీయ శ్రేణిలో ఉన్న‌వారికి అవ‌కాశం క‌ల్పిస్తారా, వ‌ల‌స‌లపై ఆధార‌ప‌డ‌తారా అనేది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close