ప‌వ‌న్ క‌ల్యాణ్ కి మ‌రోసారి కంటి ఆప‌రేష‌న్‌..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కి మ‌రోసారి కంటి చికిత్స జ‌రిగింది. హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సైట్ కంటి ఆసుప‌త్రిలో ప‌వ‌న్ కి చికిత్స ఈరోజు జరిగినట్టు జ‌న‌సేన పార్టీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. తాజా చికిత్స నేప‌థ్యంలో కొన్నాళ్ల‌పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని ప‌వ‌న్ కి వైద్యులు సూచించారు. ఆయన చికిత్స చేయించుకోవడం ఇది రెండోసారి.

నిజానికి, గ‌డ‌చిన కొన్ని నెల‌లుగా కంటి స‌మ‌స్య‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ బాధ‌ప‌డుతున్నారు. అందుకే, ఆ మ‌ధ్య ఆయ‌న ఏ కార్య‌క్ర‌మానికి హాజ‌రైనా కొన్నాళ్లుపాటు క‌ళ్ల‌జోడు పెట్టుకుని క‌నిపించారు. రంగ‌స్థ‌లం స‌క్సెస్ మీట్ లో కూడా ఆయ‌న కళ్లద్దాల‌తోనే వ‌చ్చారు. గత నెలలో ఉత్త‌రాంధ్ర టూర్ విశాఖ‌లో ముగియ‌గానే చికిత్స చేయించుకున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కంటిలో ఏర్ప‌డ్డ కురుపుని తొల‌గించిన‌ట్టు అప్పుడు వైద్యులు చెప్పారు. అయితే, ఆ త‌రువాత నుంచి త‌గినంత విశ్రాంతి తీసుకోక‌పోవ‌డంతో ఇన్ఫెక్ష‌న్ వ‌చ్చింద‌నీ, మ‌రోసారి ఆప‌రేష‌న్ చేయాల్సి ఉంటుంద‌ని వైద్యులు సూచించారు. దీంతో రెండోసారి ఆపరేషన్ చేయించుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close