ప్రొ.నాగేశ్వర్ : మావోయిస్టు సానుభూతి పరుల ముద్ర వేసి అరెస్ట్ చేసేయవచ్చా..?

దేశవ్యాప్తంగా హక్కుల కార్యకర్తల్ని వరుసగా పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. వారి అరెస్టును సుప్రీంకోర్టు తప్పు పట్టింది. హైదరాబాద్‌లో ఒక్క వరవరరావుని మాత్రమే అరెస్ట్ చేయలేదు. దేశవ్యాప్తంగా… హ్యూమన్ రైట్స్, సివిల్ రైట్స్‌ను వాయిస్ చేసేవాళ్లను అరెస్ట్ చేశారు. వీరి అరెస్ట్‌ను ఢిల్లీ హైకోర్టు తప్పు పట్టింది. తర్వాత సుప్రీకోర్టు తప్పు పట్టింది. ఇప్పటికిప్పుడు వారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది. విచారణ చేయాలనుకుంటే.. అది వాళ్లింట్లోనే చేయవచ్చు కదా అని ప్రశ్నించింది.

నిరసన ప్రజాస్వామ్యానికి సేప్టీ వాల్వ్..!

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్.. నిరసన అనేది లేకుండా.. ప్రజాస్వామ్యం మనుగడ సాగించదని స్పష్టంగా చెప్పారు. నిరసన అనేది ఆపిన రోజు ప్రజాస్వామ్యం బరస్ట్ అవుతుందని.. న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఎందుకంటే.. నిరసన అనేది.. ప్రజాస్వామ్యానికి ఓ సేఫ్టీవాల్వ్ లా లాంటిది. ఈ సేఫ్టీవాల్వ్ లేకపోతే.. కుక్కర్ ఎలా అయితే పేలిపోతుందో.. ప్రజాస్వామ్యిక వ్యవస్థ కూడా పేలిపోతుంది. నిరసనను తొక్కి పడిస్తే.. ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసినట్లేనని సుప్రీంకోర్టు స్ఫష్టంగా చెప్పింది. ఓ రకంగా అధికారంలో ఉన్న వారి చెంప చెళ్లుమనేలా… సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

సిద్ధాంతాన్ని విశ్వసించేవారు మావోయిస్టులు కాదు..!

ఇప్పుడు పుణె పోలీసులు అరెస్ట్ చేసిన వారందర్నీ .. గతంలో… కాంగ్రెస్ ప్రభుత్వం కూడా.. మావోయిస్టు సానుభూతి పరులుగా.. వారితో సంబంధాలున్న వ్యక్తులుగా గుర్తించింది. పలుమార్లు అరెస్ట్ చేసింది. ఇప్పుడు.. రాహుల్ గాంధీ ఈ అరెస్టులను ఖండించారు. నిజమే.. రాహుల్ గాంధీకి కాంగ్రెస్‌కు అరెస్టులపై మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే.. కాంగ్రెస్ హయాంలోనే ఇలా హక్కులపై మాట్లాడేవారిని ఏళ్ల తరబడి జైల్లో పెట్టారు. కానీ సమస్య బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉండేది కాదు. వీళ్లంతా మావోయిస్టు సానుభూతి పరులా అన్నది కూడా.. కరెక్ట్ కాదు. కొందరు సానుభూతి పరులు ఉన్నారు. అండొచ్చు. ఒక సిద్ధాంతాన్ని విశ్వసించడం వేరు.. సిద్ధాంతాన్ని చెబుతూ… హింసను ప్రొత్సహించడం వేరు.. హింసకు పాల్పడటం వేరు. ఒక సిద్ధాంతాన్ని విశ్వసించడం నేరం కాదు అని కోర్టులు కూడా చెప్పాయి.

ఆలోచనను అణచి వేయడం ఎవరి వల్లా కాదు..!

ఒక వ్యక్తిని ఎన్ కౌంటర్ చేయవచ్చు. ఓ ఓ వ్యక్తిని నిర్బంధించవచ్చు. కానీ ఒక ఆలోచనను.. ఎన్‌కౌంటర్ చేయడం కానీ.. నిర్బంధించడం కానీ… చేయడం.. ఏ రాజ్యతరమూ కాదు. సిద్ధాంతంపై… నమ్మకంపై ఉండటం నేరం కాదు. తనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నమ్మకం లేని వాళ్లు కూడా ఉన్నారు. ఈవీఎంలలో.. నోటా ఆప్షన్ ఉంది. తనకు ఎవరూ నచ్చలేదని.. ఓటర్ ఓటు వేయవచ్చు. అంత మాత్రాన దేశద్రోహి కాదు. పార్లమెంటరీ వ్యవస్థలపై నమ్మకం లేదంటేనే.. దేశద్రోహి కాదు. కానీ పార్లమెంటరీ వ్యవస్థల్ని నాశనం చేయాడనికి ఏదైనా కుట్ర చేస్తే.. అది కచ్చితంగా ద్రోహమే. అందుకే రాజద్రోహం కింద.. భారదేశంలో ఎంతో మందిని అరెస్ట్ చేశారు. ఎవరికీ శిక్ష పడిందిలేదు. విచారణలో నిరూపితమయిందీ లేదు. కారణమేమిటంటే.. విశ్వాసం చూపించడం వేరు.. మావోయిస్టులను సమర్థించడం వేరు… మావోయిస్టుల హింసను సమర్థించడం వేరు.. మావోయిస్టుల హింసలో భాగం పంచుకోవడం వేరని.. కోర్టుల చెప్పాయి. అందుకే.. రాజద్రోహం కేసులు నిలబడవు.

అణచివేయబడ్డ వారి కోసం పోరాటం తప్పు కాదు..!

అసలు నక్సలిజం ఎందుకు పెరుగుతోంది. సామాజిక, ఆర్థిక పరిస్థితులే కారణం. ఆదివాసీల న్యాయమైన డిమాండ్ల కోసం చాలా మంది పని చేస్తున్నారు. వారు విజయం సాధించడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తే.. ఆటోమేటిక్‌గా… నక్సలిజం తగ్గిపోతుది. మావోయిస్టు ఉద్యమం.. ఓ వ్యవస్థ నుంచి పుట్టింది. ఆదివాసీలు జల్, జంగిల్, జమీన్‌కు దూరమయినప్పుడు… వారిలో పుట్టిన తిరుగుబాటు నుంచి.. మావోయిస్టులు పుట్టుకొచ్చారు. కానీ ప్రభుత్వం సమస్యను అర్థం చేసుకోడం లేదు. జల్, జంగిల్, జమీన్ కోస పోరాడుతున్నారు కనుక ప్రభుత్వం వారందర్నీ… మావోయిస్టులే అంటున్నారు. కానీ ఎక్కడా క్లియర్ ఎవిడెన్స్ ఎక్కడా చూపించలేకపోతున్నారు.

ఆధారాలు లేకుండా అరెస్టుల వల్లే అనుమానాలు..!

ప్రధాని మోడీ హత్యకు కుట్ర పన్నారని ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు. దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయో లేవో ఎవరికీ తెలియదు. ప్రభుత్వం వద్ద ఉన్నాయనుకుందాం. హత్య కుట్రకు వీళ్లు పాల్పడ్డారా..? అన్నదే అనుమానం చాలా మందిలో ఉంది. వారి ఇళ్లలో సోదాలు చేశారు. వారి ఇళ్లలో పుస్తకాలు దొరికాయి కానీ… తుపాకులు దొరకలేదు. ఒకరి ఇంట్లో సోదాలు చేస్తే.. నువ్ ఎక్కువ చదివితే నువ్ ప్రమాదకరమని.. అంటున్నారు. బీజేపీకి చెందిన ఓ ఎంపీ.. అసలు మేధావులను కాల్చి చంపాలని ప్రకటించారు. ఆ రకమైనా ఆలోచనా విధానం నేపధ్యంలోనే.. అరెస్టులు అనుమానాలకు కారణం అవుతున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా.. కేవలం సిద్ధాంతం విశ్వాసం చూపించినంత మాత్రాన.. నేరస్తులుగా చెప్పలేము.

నిరసను అణచి వేసిన ప్రభుత్వాలు లేవు..!

బీమా-కోరెగాంలో… తమ అణిచివేతకు వ్యతిరేకంగా దళితుల తిరుగుబాటు జరిగింది. అక్కడ ఘర్షణ జరిగింది. అక్కడ హింసకు పాల్పడిన వారిపై ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయమన్నా కూడా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. నిజంగానే.. ప్రధాని మోడీపై హత్యకు కుట్ర చేసి ఉంటే.. కచ్చితంగా ఖండించాల్సిందే. మావోయిస్టులు హింసకు పాల్పడితే.. దాన్ని మేధావులుగా చెప్పుకునేవారు సమర్థిస్తే.. కచ్చితంగా తప్పే. కానీ అదే సమయంలో.. ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటే నేరం కాదు. ఆదివాసీల డిమాండ్ల కోసం పని చేస్తున్నారు కాబట్టి… వారు నేరస్తులే అనడం కూడా కరెక్ట్ కాదు. అందుకే సుప్రీంకోర్టు నిరసనను తొక్కిపడేస్తే… ప్రజాస్వామ్యం నిలబడదని చెబుతోంది. కానీ ప్రభుత్వాలు నిరసనను తొక్కి వేయడానికే ప్రయత్నించాయి. కానీ ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా విజయవంతం కాలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close