తెలంగాణ అసెంబ్లీ రద్దు నిర్ణయం ఇవాళే ఉంటుందా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రగతి నివేదన సభకు వెళ్లబోయే ముందు.. కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. ఇలా మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తూ ఉండటంతో… అసెంబ్లీ రద్దు కోసమేనని ఊహాగానాలు వెలువడుతున్నాయి. కానీ.. అసెంబ్లీ రద్దు ఇవాళ కేబినెట్‌ భేటీలో ఉండే అవకాశం లేదని.. తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలకు భారీగా వరాలు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నాయి. ప్రధానంగా రైతులు, ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని కొన్ని వరాలు ప్రకటించనున్నారు. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన మధ్యంతర భృతి కాస్త ఎక్కువగానే ప్రకటించనున్నారు. నిన్న విద్యుత్ ఉద్యోగులకు ఏకంగా 35శాతం వేతన సవరణ ప్రకటించారు. మిగతా ఉద్యోగుల విషయంలోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశం ఉంది.

రైతులకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని అంటున్నారు. రెైతుబంధు రెండో విడతకు ఇప్పటికే నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం… రెండో దఫా చెక్కుల పంపిణీ తేదీని కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. నవంబర్ నెల రెండో వారంలో చెక్కుల పంపిణీ ఉండవచ్చు. జోనల్ వ్యవస్థకు ఆమోదం వచ్చింది కాబట్టి.. భారీగా ఉద్యోగ నియాకాల నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఆత్మగౌరవ భవనాలు, ఎస్సీ-ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అర్చకుల పదవీ విరమణ వయస్సు పెంపు, మౌజామ్ లకు వేతనం పెంపు లాంటి ప్రకటనలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది.

పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు కానీ.. అసెంబ్లీని మాత్రం రద్దు చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే.. ఇన్ని నిర్ణయాలు తీసుకుని ఇదే కేబినెట్ భేటీలో అసెంబ్లీ రద్దు నిర్ణయాన్నికూడా తీసుకుంటే..వాటికి విలువ ఉండదు. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను.. కొంగరకాలన్ సభలో కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడే ముందస్తుపై ప్రకటించి.. తర్వాత ఒకటి రెండు రోజుల్లో మరోసారి కేబినెట్ భేటీ నిర్వహించి అసెంబ్లీ రద్దుపై తీర్మానం చేయనున్నారని చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించాల్సిన అవసరం లేదని.. గవర్నర్‌ కూడా క్లారిటీ ఇవ్వడంతో.. కేసీఆర్‌కు పెద్ద భారం దిగిపోయింది. మొత్తంగా చూస్తే.. అసెంబ్లీ రద్దు నిర్ణయం ఈ రోజు కేబినెట్‌లో తీసుకునే చాన్స్ లేదు. కానీ కేసీఆర్ రాజకీయం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో మాత్రం చెప్పలేం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close