అసెంబ్లీ రద్దు తర్వాత ఏంటి..? కేసీఆర్ తీసుకున్న జాగ్రత్తలేంటి..?

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ.. ముఖ్యమంత్రి గవర్నర్‌కు కేబినెట్ తీర్మానం ఇచ్చి.. దానికి ఆమోదముద్ర పడిన తర్వాత.. ఆపద్ధర్మ సీఎంగా.. కేసీఆర్ కొనసాగడం.. ఖాయమే. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కీడెంచి మేలెంచమన్నట్లు కేసీఆర్.. తన జాగ్రత్తలో తాను ఉన్నారు. అధికారులతో ఇప్పటికే లోతుగా అధ్యయనం చేయించారు. ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఉండే అధికారుాలపై ఓ ఉన్నతాధికారుల బృందం ప్రత్యేకంగా పరిశీలన జరిపింది. అసెంబ్లీని రద్దు చేస్తే ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించడం ఈసీ విధి. వాయిదా వేయడానికి వీల్లేదు.

ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముందుగానే అసెంబ్లీని రద్దు చేసినా అరునెలలలోపే ఎన్నికలు నిర్విహించారు. 2003 నవంబర్ 15 న చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీని రద్దు చేశారు. నాటి నుండి ఆరు నెలలలోపు ఎన్నికలు పూర్తి కావడమే కాకుండా గడవు కంటే ఒక్క రోజు ముందే అంటే మే 14 ,2004 నే అసెంబ్లీ సమావేశమైంది. ఇవే కాకుండా సుప్రీం కోర్టు తీర్పులు కూడా 6 నెలలలోపే ఎన్నికలు పూర్తి చేయాలని స్పష్టంగా ఉన్నాయి. దీంతో నాలుగు రాష్ట్రాలతో ఎన్నికలు నిర్వహించకపోయినా ఆరు నెలలలోపు అంటే ఫిబ్రవరి నెలాఖరులోపు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని నివేదికను ఉన్నతాధికారులు కేసీఆర్‌కు అందించారు. అప్పట్లో చంద్రబాబు కోరుకున్న విధంగా మూడు నాలుగు నెలలలోపు నిర్వహించకపోయినా ఆరు నెలల నిబంధన పాటించాల్సి వచ్చిందని చెప్తున్నారు..

ఎన్నికలు పూరైయ్యే వరకు ఉండే ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఉండే అధికారాలపై ఇప్పటికే ఓ నివేదిక తయారు చేశారు. ఎన్నికల కోడ్ కిందకు వచ్చే వరకు కొన్ని విషయాలు మినహాయిస్తే సాధారణ ప్రభుత్వానికి ఉండే అన్ని అధికారాలు ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఉంటాయని చెప్తున్నారు. ఈ విషయంలో 1971లో యుఎన్ రావు వర్సెస్ ఇందిరాగాంధీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తొంభై ఒక్క పేజీలో తీర్పులో ఆపద్ధర్మ ప్రభుత్వ అధికారాలను స్పష్టంగా వివరించిందని అభిప్రాయపడుతున్నారు. కరుణానిధిపై కేసు విషయంలోనూ మద్రాసు హైకోర్టు మరోసారి దీనిని బలపరిచిందని చెప్తున్నారు .దీంతో ఆపద్ధర్మ ప్రభుత్వంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని కేసీఆర్ ఓనిర్ణయానికి వచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close