మైనార్టీతో పాటు గిరిజన వర్గానికీ చాన్స్..! అసెంబ్లీ తర్వాతే ఏపీ మంత్రివర్గ విస్తరణ..!!

ఎన్నికల ముందు.. ఏపీ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. నిన్నామొన్నటి వరకు.. ఒక్క ముస్లిం మైనారిటీకి మంత్రి పదవి ఇచ్చి .. మార్పు చేర్పులేమీ లేకుండా పని పూర్తి చేద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు.. అన్ని వర్గాలను సంతృప్తి పరిచే లక్ష్యంతో రెండు ఖాళీలనూ భర్తీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాదు కొంత మంది శాఖలను కూడా మార్చబోతున్నారట. ఆరో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందే ఇదంతా పూర్తి చేయాలని చంద్రబాబు భావించారు. అయితే నందమూరి హరికృష్ణ మరణంతో విస్తరణ వాయిదా పడింది.

మైనార్టీలకు కేబినెట్‌లో చోటు లేదని కొంత మంది పదే పదే విమర్శలు చేస్తూండటంతో మంత్రివర్గంలోకి మైనారిటీలను తీసుకుంటామని గుంటూరు సదస్సులో చంద్రబాబు ప్రకటించారు. మొదట్లో విస్తరణకే పరిమితం కావాలనుకున్న చంద్రబాబు ఇప్పుడు పునర్వ్యస్థీకరణ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. మైనార్టీ వర్గం నుంచి షరీఫ్ తో పాటు.. ఫరూక్ పేరు కూడా పరిశీలనలోకి ఉంది. ఇదే సమయంలో ఎస్టీల నుంచి కూడా ఒకరిని కేబినెట్లోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఎన్నికలు వస్తున్నందున ఎస్టీలకు కూడా మంత్రివర్గంలో చోటిస్తే బావుంటుందని సీనియర్లు చంద్రబాబుకు సూచించారు.
విజయనగరం జిల్లాకు చెందిన సంధ్యారాణి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈమెకు అవకాశం దక్కుతుందన్న ప్రచారం ప్రారంభమయింది.

మంత్రుల శాఖలనను కూడా మార్చాలని ప్రాథమికంగా ఓ నిర్ణయానికొచ్చినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖకు పూర్తి స్థాయి మంత్రిని నియమించాలనే ఆలోచన చేస్తున్నారు. ఏజెన్సీ ఏరియాలో జ్వరాలపై ఇప్పటికే అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖను ఎవరైనా మంత్రికి అప్పగిస్తే వారి వద్ద ఉన్న శాఖలను వేరే వారికి సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు. ఈ శాఖ సీనియర్లకు కేటాయిస్తే..వారి శాఖలు వేరే వారికి సర్దుబాటు చేయాలి. అలా కదిలిస్తే.. చాలా మంది శాఖలు మార్చాల్సి వస్తుంది. అందుకే.. మొత్తంగా కసరత్తు చేసి.. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com