స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు మూవీ స్టన్నింగ్ ఫస్ట్ లుక్ రీలీజ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా… సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో… సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో… విజయవంతమైన చిత్రాలకు కేరాఆఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం సరైనోడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. విభిన్నమైన ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ఈ ప్రీ లుక్ పోస్టర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రీ లుక్ పోస్టర్స్ తో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు.. అల్లు అర్జున్ అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్ నెలకొంది. కండలు తిరిగిన చేతితో… హ్యాండిల్ తో కూడిన ఇనుప గుండును పట్టుకున్న ఈ పోస్టర్ తో అభిమానులు పండగ చేసుకున్నారు. ఇదే క్రేజ్ ను కంటిన్యూ చేస్తూ… సరైనోడు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించింది. అల్లు అర్జున్ స్టామినాను, బోయపాటి శ్రీను లాంటి మాస్ డైరెక్టర్ టేకింగ్ ను మిళితం చేసి రూపొందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా రేంజ్ భారీగా పెరిగిందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్, కేథరీన్ అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అంజలి ఓ ప్రత్యేకగీతంలో అల్లు అర్జున్ తో కలిసి స్టెప్పులేసింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.

ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ…. సరికొత్త ప్రమోషన్ లో భాగంగా సరైనోడు చిత్రానికి సంబంధించి ఇటీవలే ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశాం. ఈ పోస్టర్ చూసిన తర్వాత ఇండస్ట్రీ వర్గాల నుంచి.. అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అసలు సిసలు ఫస్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా… అని ఎదురుచూశారు. ఈ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ… సరైనోడు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేశాం. భారీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సరైనోడు చిత్రాన్ని నిర్మిస్తున్నాం. అల్లు అర్జున్ ని సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నాడు బోయపాటి శ్రీను. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే హై ఓల్డేజ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. రకుల్, కేథరీన్ గ్లామర్, తమన్ సంగీతం, రిషి పంజాబి ఛాయాగ్రహణం ప్రత్యేక ఆకర్షణ. అల్లు అర్జున్, అంజలి కాంబినేషన్లో వచ్చే ప్రత్యేక గీతం సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. అని అన్నారు.

నటీనటులు
అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ థెస్రా, శ్రీకాంత్, ఆది పినిశెట్టి, సాయి కుమార్, బ్రహ్మానందం, జయప్రకాష్, జయప్రకాష్ రెడ్డి, సురేఖా వాణి, విద్యుల్లేఖ, దేవ దర్శిని, అంజలి (ప్రత్యేక పాటలో)

సాంకేతిక వర్గం
బ్యానర్ – గీతా ఆర్ట్స్
ప్రొడక్షన్ కంట్రోలర్స్ – బాబు, యోగానంద్
చీఫ్ కోఆర్డినేటర్ – కుర్రా రంగారావ్
ఆర్ట్ డైరెక్టర్ – సాయి సురేష్
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్
ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వర రావ్
ఫైట్ మాస్టర్స్ – రామ్ లక్ష్మణ్, రవి వర్మ
డిఓపి – రిషి పంజాబి
డైలాగ్స్ – ఎం.రత్నం
మ్యూజిక్ – ఎస్ ఎస్ తమన్
కో ప్రొడ్యూసర్ – శానం నాగ అశోక్ కుమార్
ప్రొడ్యూసర్ – అల్లు అరవింద్
డైరెక్టర్ – బోయపాటి శ్రీను

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close