మీ తాత, తండ్రి కాదు మా తాత, తండ్రే డెవలప్ చేశారు – నారా లోకేష్

హైదరాబాద్: తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ హైదరాబాద్ నగరంలో గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్ షోలలో మాట్లాడుతూ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌పై లోకేష్ విమర్శనాస్త్రాలు సంధించారు. కేటీఆర్‌ను ఉద్దేశించి, “అన్నా, నీ తాత హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినాడా, మీ నాన్న హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినాడా, మీ పార్టీ హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినాదా అని ఈ బహిరంగ సభా ముఖంగా అడుగుతున్నా. వాస్తవమే, ఆనాడు మా తాత స్వర్గీయ నందమూరి తారక రామారావుగారు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినారు, అదేవిధంగా మా నాన్న చంద్రబాబునాయుడుగారు అభివృద్ధి చేశారు” అని లోకేష్ అన్నారు. బెంగళూరు, హైదరాబాద్‌ నగరాలలో ఒకేసారి మెట్రో పనులు ప్రారంభమయ్యాయని, అయితే బెంగళూరులో మెట్రో ప్రాజెక్ట్ పూర్తయిందని, ఇక్కడ మాత్రం ఇంకా పూర్తి కాలేదని విమర్శించారు. టీడీపీ-బీజేపీ గెలిస్తే కేంద్రం నుంచి గల్లీకి నిధులు వస్తాయన్నారు. ముసలి మంత్రులు ప్రచారానికి వస్తారని, నడుము నొప్పి రాకూడదని హడావుడిగా నగరంలో కొన్ని రోడ్లు వేశారని లోకేష్ ఎద్దేవా చేశారు. టీడీపీ కన్‌స్ట్రక్షన్ పార్టీ అని, టీఆర్ఎస్ డిస్ట్రక్షన్ పార్టీ అని చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close