టీడీపీలోకి చలమలశెట్టి సునీల్..!

తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పార్టీ తరపున కాకినాడ ఎంపీ అభ్యర్థి అవుతారనుకున్న చలమలశెట్టి సునీల్.. తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం టీడీపీ అధినేతను కలిశారు. పార్టీలో చేరేందుకు సంసిద్ధత తెలిపారు. వచ్చే నెల రెండో వారంలో.. ఆయన టీడీపీలో చేరనున్నారు. చలమలశెట్టి సునీల్ 2014 ఎన్నికల్లో కాకినాడ నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అంతకు ముందు 2009లోనూ.. పీఆర్పీ అభ్యర్థిగా అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రెండు సార్లు కూడా .. స్వల్ప తేడాతోనే ఆయన పరాజయం పాలయ్యారు. ఆ తర్వతా వైసీపీలో యాక్టివ్‌గా ఉన్నా… జగన్ మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు.

ఇటీవలి కాలంలో తూర్పుగోదావరి వైసీపీలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొంత మంది పార్టీని గుప్పిట పట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో సునీల్‌కు ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించేశారు. జగన్‌ పాదయాత్రకు కూడా సునీల్ దూరంగా ఉన్నారు. ప్రధాన సామాజిక వర్గానికి చెందిన సునీల్‌ను పార్టీలోనే ఉంచేందుకు పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. దానికి కారణం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పెత్తనమే కారణమని సునీల్ వర్గీయులు చెబుతున్నారు. వైసీపీ కాకినాడ సిటీ కోఆర్డినేటర్‌ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి.. ముందు నుంచీ వైఎస్‌ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. జగన్‌తో ఆయనకు వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. దాంతో ద్వారంపూడిని కాదని సునీల్‌కు ప్రాధాన్యత ఇవ్వక.. ఆయనను వదులుకున్నారు జగన్.

వైసీపీ కాకినాడ లోక్‌సభ కోఆర్డినేటర్‌గా ఉన్న చలమలశెట్టి సునీల్‌.. జిల్లా రాజకీయాలలో ప్రాధాన్యం ఉన్న సామాజిక వర్గం. పార్టీలకు అతీతంగా సునీల్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పారిశ్రామిక కుటుంబానికి చెందిన సునీల్‌కి ఈ జిల్లాలో ముఖ్యంగా మెట్ట ప్రాంతంలో మంచి పట్టుంది. ఇవన్నీ జగన్‌కి తెలిసినా.. పరోక్షంగా ద్వారంపూడికే సపోర్టు చేశారు. రాజ్యసభ ఎన్నికలకు ముదే టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. మూడో అభ్యర్థిగా సునీల్‌ను నిలబెడతారని చెప్పుకున్నారు. కానీ అప్పట్లో మూడో అభ్యర్థిని టీడీపీ నిలబెట్టలేదు. ప్రస్తుత కాకినాడ ఎంపీ తోట నరసింహం.. ఈ సారి పోటీకి దూరంగా ఉండాలని అనుకుటున్నారు. ఏదో ఓ అసెంబ్లీ స్థానం నుంచి తన భార్య, మెట్ల సత్యనారాయణ కుమార్తె అయిన శ్రీవాణిని నిలబెట్టాలనుకుంటున్నారు. దాంతో సునీల్‌కు కాకినాడ సీటు ఖరారయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close