విశాఖలో ప్రముఖ థియేటర్లలో భారీ అగ్ని ప్రమాదం…

హైద‌రాబాద్ ఆర్‌టిసి క్రాస్ రోడ్స్‌లో సంధ్య‌, సుద‌ర్శ‌న్‌ థియేట‌ర్‌లు ఎంత పాపుల‌రో.. విశాఖ‌లోని గాజువాలో గ‌ల క‌న్య‌, శ్రీ‌క‌న్య థియేట‌ర్‌లు అంత పాపుల‌ర్‌. రెండూ ఒకే బిల్డింగులో వుంటాయి. పేరుకు సింగిల్ స్క్రీన్ థియేట‌ర్‌లు. కాని మ‌ల్టీప్లెక్స్‌ల‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో వుంటుందని విశాఖపట్టణ వాసులు చెబుతుంటారు. సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరగడంతో థియేట‌ర్‌లు పూర్తిగా కాలిపోయాయి. బూడిద మాత్రమే మిగిలింది. ఉదయమే థియేటర్‌కి వచ్చిన సిబ్బంది పొగలు రావడం గమనించి యజమానికి సమాచారం అందించారు. ఆయన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. థియేటర్ల దగ్గరకు ఫైరింజన్లు చేరుకునే సరికే థియేటర్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. ఎనిమిది ఫైరింజన్ల సాయంతో కొన్ని గంటలపాటు ప్రయత్నించిన తరవాత మంటలు అదుపులోకి వచ్చాయి.

ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు కొన్నాళ్ల కింద‌ట ఈ రెండు థియేట‌ర్‌ల‌ను రీ మోడ‌లింగ్‌ చేశారని తెలుస్తుంది. ఆయ‌న‌కు ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో థియేటర్లు వున్నాయి. వాటిలో కొన్ని లీజుకు తీసుకున్నవి, మరికొన్ని సొంతవి. కన్య, శ్రీకన్య థియేటర్లను దిల్‌రాజు లీజుకు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన లీజులో వున్నాయో… లేదో… తెలియాల్సి వుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు మూడు కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ వెదుకులాట!

బీఆర్ఎస్ ను చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది....

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న జోరు చూపిస్తోంది. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టాక‌, ఆ ఉత్సాహం మ‌రింత‌గా పెరిగిపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కాలు పెడుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జోడీ క‌ట్ట‌డానికి...

22మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి హరీష్..!?

బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హారీష్ రావు కాంగ్రెస్ లో చేరనున్నారా..? 20-22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతుండగా..ఆ ఎమ్మెల్యేల వెనక బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close