“ఒక ఓటు మూడు రాష్ట్రాలు” బీజేపీ కొత్త నినాదమా..?

కాకినాడలో భారతీయ జనతా పార్టీ అప్పుడెప్పుడో… ఒక ప్లీనరీ లాంటి సమావేశం నిర్వహించుకుని… ఒక ఓటు రెండు రాష్ట్రాలనే తీర్మానం చేసింది. ఇప్పట్లాగే అప్పట్లో బీజేపీని పట్టించుకునేవారు లేరు కాబట్టి.. ఆ తీర్మానాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ తర్వతా ఆ తీర్మానమే ఏకుమేకైంది. నిన్నటికి నిన్న కాకినాడలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావశం జరిగింది. ఇందులోనూ.. అలాంటి తీర్మానం లాంటి ఛాయలు స్పష్టంగా కనిపించింది. ప్రత్యేకంగా తీర్మానం చేయలేదు కానీ.. తమ తమ మాటల్లో మాత్రం.. ఒక్క ఓటు .. మూడు రాష్ట్రాలనే వాదనను.. గట్టిగానే వినిపించే ప్రయత్నం చేశారు. రాజకీయ తీర్మానంలో ఇదే అంశాన్ని అంతర్గీలనంగా గట్టిగానే చొప్పించారు. ఏ ప్రాంతానికి చెందిన నేతలు ఆ ప్రాంతంలో విభజన బీజాలు నాటాలనే పద్దతిలో.. సమావేశంలో చర్చించుకున్నారు. బయట కూడా అవే చెప్పారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారట. సాగునీటి ప్రాజెక్టులు, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి సహకరించడం లేదట. రాష్ట్రంలో పాల డెయిరీలు నష్టాలతో మూత పడుతుంటే..చంద్రబాబు కుటుంబ డెయిరీ మాత్రం లాభాలతో వృద్ధి చెందుతోందట. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుపై చంద్రబాబు మాట ఇచ్చి తప్పారట. ఏపీలో పెట్రోలు ధర ఎక్కువ ఉండడానికి రాష్ట్ర పన్నులే కారణమట. కర్నూలులో గవర్నర్ గెస్ట్‌హౌస్‌ను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం రాజకీయ తీర్మానంలో.. చంద్రబాబును దెబ్బకొట్టాలంటే.. విభజన వాదం వినిపించడం మినహా.. వేరే దారి ఏదీ బీజేపీ నేతలకు కనిపించలేదు.

ఈ సమావేశంలో… ఏపీకి సంబంధించిన ఢిల్లీ బీజేపీ అగ్రనేతలు కూడా పాల్గొన్నారు. కానీ ఒక్కరంటే.. ఒక్కరు కూడా.. విభజన హామీల విషయంలో కేంద్రం నుంచి ఇంకా ఏమేమి రావాల్సి ఉన్నాయి.. ? ఎందుకు చేయలేకపోతున్నాం..? అని ఒక్కరు కూడా ప్రశ్నించకోలేదు. ఇదిగో రైల్వేజోన్ అన్నారు.. అదిగో కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు. కానీ ఒక్కరికీ అవేమీ గుర్తుకు రాలేదు. కానీ… రాయలసీమ, ఉత్తరాంధ్రలకు అన్యాయం దరిగిపోతందని మాత్రం గగ్గోలు పెట్టేందుకు సిగ్గుడలేదు. ఉత్తరాంధ్రకు రైల్వేజోన్ ఇవ్వకుండా.. కడపకు స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా… అత్యంత దారుణంగా నమ్మకద్రోహం చేసింది బీజేపీనే. వాళ్లే ప్రజల మనసుల్లో విష బీజాలు నాటేందుకు బయలుదేరారు. ప్రస్తుతం బీజేపీ నేతల భావ దారిద్య్రం చూస్తూంటే.. ఒక్క ఓటుకు మూడు రాష్ట్రాలని ప్రచారం చేసుకుని ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యం లేదన్నట్లుగా పరిస్థితి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close