మహాకూటమిలో టీడీపీ సీట్లు ఖరారు..! 19కి ఫైనల్ చేసుకున్నారా..?

తెలంగాణలో మహాకూటమి కసరత్తు మెల్లగా ఓ కొలిక్కి వస్తోంది. అంతర్గతంగా.. సీట్ల సర్దుబాటు దాదాపుగా పూర్తయింది. కూటమి పక్షాలు పొత్తులు, తాము పోటీ చేయదలిచిన స్థానాల వివరాలను కాంగ్రెస్ పార్టీకి అందించాయి. సర్వేల ఆధారంగా.. కాంగ్రెస్ పార్టీ బలాబలాలను అంచనా వేసి తుది నిర్ణయం తీసుకోనుంది. కాంగ్రెస్ పార్టీకి మిగతా పార్టీలు పెత్తనం అప్పగించాయి. కూటమి ఏర్పాటు కోసం పట్టు విడుపులతో ముందుకు వెళ్లాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి. అందుకోసం కూటమి పక్షాలు సహా కాంగ్రెస్ పరిస్థితి, అభ్యర్థుల బలం పైన సర్వే నిర్వహించాలని నిర్ణయించారు.

సర్వే కోసం తాము పోటీ చేయాలనుకుంటున్న సీట్ల వివరాలను.. టీడీపీ, సీపీఐ, టీజేఏఎస్ కు అందించాయి. టీజేఎస్ కొన్ని ప్రత్యేక షరతులు పెట్టినట్లు సమాచారం. మహాకూటమికి కామన్ ఎజెండా రూపొందించాలి.. అధికారంలోకి వస్తే అమలు కోసం ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేసి దానికి చట్టబద్దత కల్పించాలని.. దానికి కోదండరాం ను చైర్మన్ చేయాలన్న కండిషన్ పెడుతున్నారు. వీటిపై తుది విడత చర్చల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నికలపై స్పష్టమైన విజన్‌తో ఉన్న టీడీపీ…పోటీ చేయాలనుకుంటున్న 19 అసెంబ్లీ సీట్ల వివరాలను… కాంగ్రెస్‌కు ఇచ్చింది. కాంగ్రెస్ కు బలమైన అభ్యర్ధులు లేని సీట్లనే టీడీపీ కోరుతుంది. మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియ‌ర్లలంద‌రికి టికెట్లు ద‌క్కేలా జాబితా రూపొందించారు.

1. దేవరకద్ర – రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ
2. మక్తల్ – కొత్తకోట దయాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
3. మహబూబ్ నగర్- చంద్రశేఖర్ , మాజీ ఎమ్మెల్యే
4. రాజేంద్రనగర్ – భూపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా టిడిపి అధ్యక్షుడు
5. శేరిలింగంపల్లి – మండవ వెంకటేశ్వరరావు
6. కూకట్ పల్లి- మందడి శ్రీనివాస రావు ,
7. సికింద్రాబాద్ కంటోన్మెంట్ – ఎం.ఎన్.శ్రీనివాస్ రావు
8. సికింద్రాబాద్ – కూన వెంకటేష్ గౌడ్,
9. ఉప్పల్- వీరేందర్ గౌడ్
10. ఖైరతాబాద్ -బి.ఎన్.రెడ్డి
11. కోరుట్ల -ఎల్ . రమణ
12. హుజూరాబాద్ – ఇనగాల పెద్దిరెడ్డి
13. ఆర్మూర్ – ఏలేటి అన్నపూర్ణ
14. పరకాల లేదా వరంగల్ వెస్ట్ – రేవూరి ప్రకాష్ రెడ్డి
15. ఆలేరు – బండ్రు శోభారాణి
16. కోదాడ – బొల్లం మల్లయ్య యాదవ్
17. మిర్యాలగూడ -శ్రీనివాస్
18. ఖమ్మం – నామా నాగేశ్వర రావు , మాజీ ఎంపీ
19. సత్తుపల్లి – సండ్ర వెంకట వీరయ్య , ఎమ్మెల్యే

ఈ సీట్లలో క‌నీసం 15 చోట్ల పోటీ చేయాలని టీ టీడీపీ నేతలు గట్టిగా నిర్ణయించుకున్నారు. ఖ‌చ్చితంగా గెలిచే సీట్లనే తీసుకోవాల‌ని నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఫ్లాష్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఒకటి రెండు రోజుల్లో సర్వే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సీట్ల సర్దుబాటు పై రెండో దఫా చర్చలు ప్రారంభిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘పుష్ష 2’ సెట్లో గొడ‌వ జ‌రిగిందా?

జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. రోజుకో నిజం బ‌య‌ట‌కు వ‌స్తోంది. జానీ మాస్ట‌ర్‌కూ బాధితురాలికీ మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చాల‌ని ఓ పెద్ద హీరో ప్ర‌య‌త్నించిన‌ట్టు వార్త‌లొచ్చాయి. ఇప్పుడు ద‌ర్శ‌కుడు సుకుమార్...

ఆ ప్రజాగ్రహ ఓటులోనే బూడిదయ్యారు జగన్ గారూ !

జగన్ రెడ్డి ఓడిపోయినా ఇసుమంత కూడా మారలేదని తనను వదిలి పోతున్న పార్టీ నేతల గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు చేసిన వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. ఎవరు పోయినా పర్వాలేదని.. ప్రజల...

కుక్కలకు వల వేశారు.. కాంతి రాణా కోర్టుకెళ్లారు !

హీరోయిన్ జెత్వానీ కేసులో పరారీలో ఉన్న కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు. డెహ్రాడూన్ లో దాక్కుని తన స్నేహితుడి ఫోన్ వాడుతున్న ఆయనపై నిఘా పెట్టి పోలీసులు పట్టుకున్నారు....

బీజేపీ నేతలు మనుషులైతే చంద్రబాబును తిట్టాలి : జగన్

జగన్ రెడ్డి బీజేపీ నేతలకు పెద్ద టెస్టే పెట్టారు. బీజేపీ నేతలు .. మనషులు అయితే చంద్రబాబును తిట్టాలట. బహుశా.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు .. తనకు గిలిగింతలు పెట్టడానికి అందరూ తిట్టారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close