తెలుగులోకి ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌??

తెలుగులో ‘అర్జున్‌రెడ్డి’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. విజయ్‌ దేవరకొండను ఓవర్‌నైట్‌ స్టార్‌ను చేసింది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ వంటి సినిమాలకు దారి చూపింది. బోల్డ్‌ సినిమాలకు బాటలు వేసింది. ‘అర్జున్‌రెడ్డి’ని చూడని తెలుగు యువతీయువకులు లేరంటే అతిశయోక్తి లేదు. మ్యాగ్జిమమ్‌ తెలుగు ఆడియన్స్‌ చూసేసిన ఈ సినిమాను తమిళంలో విమర్శకులు ప్రశంసలందుకున్న సినిమాలు తీసిన దర్శకుడు బాల ‘వర్మ’ పేరుతో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తమిళ సినిమాను తెలుగులో డబ్బింగ్‌ చేస్తారా? అనే డౌట్స్‌ వస్తున్నాయి.

హీరో విక్రమ్‌ కుమారుడు ధృవ్‌ విక్రమ్‌ ‘వర్మ’తో హీరోగా ఇంట్రడ్యూస్‌ అవుతున్నాడు. ఆదివారం ధృవ్‌ బర్త్‌డే సందర్భంగా సినిమాలో అతని ఫస్ట్‌లుక్‌, సినిమా టీజర్‌ విడుదల చేశారు. తెలుగు ప్రేక్షకులు టీజర్‌ మీద సెటైర్లు వేస్తున్నారుకోండి… ఆ విషయం పక్కన పెడితే, తెలుగులో కూడా ‘వర్మ’ పోస్టర్‌, లుక్‌ విడుదల చేశారు. తెలుగు సినిమాను తమిళంలో రీమేక్‌ చేస్తూ, ఆ సినిమా పోస్టర్లు తెలుగులో విడుదల చేయడం ఎందుకు?? దీని వెనుక విక్రమ్‌ వున్నాడని టాక్‌!! విక్రమ్‌కి తెలుగు మార్కెట్‌ విలువ తెలుసు. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ తరవాత తెలుగులో మార్కెట్‌ సంపాదించుకున్న హీరో విక్రమే. తనయుడికీ తెలుగులో మార్కెట్‌ ఏర్పాడాలని విక్రమ్‌ ఆశిస్తున్నాడట! అందుకని, తెలుగు సినిమా రీమేకైనా… విక్రమ్‌ తనయుడు ఎలా చేశాడోనని కొంతమంది ఆసక్తి కనబరుస్తారు కదా!! ఆ ఉద్దేశంతో విడుదల చేయాలనుకుంటున్నారేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : టీవీ9 మహాపతనం

ఒళ్లు అమ్ముకునేవాళ్లైనా కొన్ని రూల్స్ పెట్టుకుంటారేమో కానీ.. టీవీ9కి మాత్రం ఎలాంటి నైతిక విలువలు .. మీడియా రూల్స్ పెట్టుకోలేదు. నిర్భయంగా ఫేక్‌ వార్తలు ప్రసారం చేసేసింది. చంద్రబాబు వాయిస్...

లెట్స్ ఓట్ : ఇళ్లు, ఒళ్లు కాపాడుకునే చివరి అవకాశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఏపీ ప్రజలకు ఇది ఓ రకంగా చివరి అవకాశం. ఇళ్లు, ఒళ్లు కాపాడుకునేందుకు వచ్చిన చివరి అవకాశం. గతంలో ఎవరు అధికారంలోకి వస్తే ఏమవుతుందిలే...

ప్రారంభమైన పోలింగ్…బరిలో ప్రముఖులు వీరే..!

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా కాసేపటి క్రితం నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంట్ సెగ్మెంట్లలో సోమవారం పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలోని మొత్తం 17, ఏపీలోని...

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close