‘నోటా’లో కేసీఆర్‌, కేటీఆర్‌ ?

పొలిటిక‌ల్ డ్రామాలెప్పుడూ ఆస‌క్తిక‌రంగానే ఉంటాయి. దాన్ని డీల్ చేసే ప‌ద్ధ‌తి తెలియాలంతే. స‌మ‌కాలీన రాజ‌కీయాల్ని స‌మ‌ర్థంగా తెర‌కెక్కించ‌గ‌లిగితే… పొలిటిక‌ల్‌డ్రామా పైసా వ‌సూల్ సినిమాలా మారిపోతుంది. ఈమ‌ధ్య పొలిటిక‌ల్ డ్రామాలు ఎక్కువ‌వుతున్నాయి. ఆ కోవ‌లోనే వ‌స్తున్న సినిమా `నోటా`. ట్రైల‌ర్లు, పోస్ట‌ర్లు చూస్తే ఈ సినిమా మొత్తం రాజ‌కీయాల చుట్టూనే తిరుగుతుంద‌న్న విష‌యం అర్థ‌మైపోతోంది. అయితే త‌మిళ ఫ్లేవ‌ర్ కాస్త ఎక్కువ‌గా క‌నిపిస్తుండ‌డంతో… అక్క‌డి పోలిటిక్స్ కి మాత్ర‌మే ఈ క‌థ ప‌రిమిత‌మ‌వుతుంద‌ని అనుకున్నారు.

కానీ చిత్ర రూప‌కర్త‌ల ఆలోచ‌న‌లు వేరుగా ఉన్నాయి. ద‌క్షిణాది రాజ‌కీయాల ముఖ‌చిత్రాన్ని నోటాలో ఆవిష్క‌రించేశార‌ని టాక్‌. త‌మిళ రాజ‌కీయాలే కాదు, ప్ర‌స్తుతం న‌డుస్తున్న ఆంధ్ర‌, తెలంగాణ రాజ‌కీయాల్ని కూడా ఈ సినిమాలో చూడొచ్చ‌ని స‌మాచారం. రాష్ట్రం విడిపోతున్నప్ప‌టి ప‌రిస్థితుల్ని, ఆ త‌ర‌వాత జ‌రిగే ప‌రిణామాల్ని కూడా ఇందులో చూచాయిగా చూపించార‌ని తెలుస్తోంది. అంతేకాదు.. కేసీఆర్‌, కేటీఆర్‌ల‌ను పోలిన పాత్ర‌లు ఈ సినిమాలో చూడ‌చ్చ‌ని, వాళ్ల‌ని సైతం పాజిటీవ్ యాంగిల్‌లోనే చూపించార‌ని తెలుస్తోంది. జ‌య‌ల‌లిత ఎపిసోడ్ కూడా ఈ సినిమాలో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని తెలుస్తోంది. జ‌య‌ల‌లిత ఆసుపత్రిలోనే క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆసుప‌త్రిలో ఏం జ‌రిగిందో ఎవ్వ‌రికీ తెలీదు. ఆ ఎపిసోడ్‌ని గుర్తు చేస్తూ.. కొన్ని డైలాగులు పేల్చార‌ట‌. క‌ర్నాట‌క‌, కేర‌ళ రాజకీయాల్నీ ఇందులో ప్ర‌స్తావించిన‌ట్టు తెలుస్తోంది. అయితే… మ‌రీ వివాదాస్ప‌దం కాకుండా, ఎవ‌రి పేరూ బ‌య‌ట‌కు తీసుకురాకుండా.. ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మై, అర్థం కాని రీతిలో స‌న్నివేశాల్ని న‌డిపించేశార‌ని తెలుస్తోంది. అవ‌న్నీ ఏ రేంజులో పండాయో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close