క్రైమ్: నడిరోడ్డుపై హత్యలు లెటెస్ట్ ట్రెండ్‌గా మారిపోయిందా..?

తెలంగాణలో నడిరోడ్డుపైనే అరాచకాలు చోటుచేసుకున్నాయి. జనం అంతా చూస్తుండగానే.. దారుణాలు జరిగిపోతున్నాయి. చుట్టుపక్కల వారు చూస్తూ ఉండగానే..సినిమాల్లో మనుషుల్ని చంపినట్లు..నిజంగానే చంపేస్తున్నారు. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని ఓ తండ్రి మూర్ఖంగా ఆలోచించాడు. కిరాయి ముఠాకు సుపారీ ఇచ్చి మరీ పట్టపగలు కూతురి భర్తను హత్య చేయించాడు. ఈ హత్య జరిగిన ఐదో రోజే మరో ఘోరం హైదరాబాద్‌ ఎర్రగడ్డలో ప్రధాన రహదారిపై జరిగింది. ఏకంగా కన్నతండ్రే కూతురిపైనా.. కూతురు పెళ్లి చేసుకున్న యువకుడిపైనా కొబ్బరిబోండాలు నరికే కత్తితో ఎటాక్‌ చేశాడు. ఈ దాడిలో యువకుడు తప్పించుకోగా.. కూతురినే కిరాతకంగా కత్తితో నరికాడు ఆ కన్నతండ్రి. తీవ్ర గాయాలపాలైన ఆ యువతిని వైద్యులు క్లిష్టమైన ఆపరేషన్లు చేసి బతికించారు.

ఇది అలా మైండ్‌లో ఉండిపోగానే.. అత్తాపూర్‌లో మరో సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఓ వ్యక్తిని దాదాపు వంద మీటర్ల దూరం వెంటాడి గొడ్డలితో హత్య చేశారు ప్రత్యర్థులు. గొడ్డలితో నరికేందుకు ప్రయత్నిస్తున్న వాళ్లను ఆ వ్యక్తి తీవ్రంగా ప్రతిఘటించాడు. కానీ తనను తాను కాపాడుకోలేకపోయాడు. అలా ఓ మనిషిని చంపుతారని… నమ్మలేని జనం అలా చూస్తూండిపోయారు. కొంత మంది కోలుకుని.. ఆపే ప్రయత్నం చేసినా.. ఎవరి ప్రాణభయం వారిది. 12 రోజుల వ్యవధిలో జరిగిన ఈ దారుణ హత్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. ఈ పైశాచిక హత్యలు జరిగిన తీరు భయానకంగా ఉంది. ఎదుటి మనిషిపై పగ, ప్రతీకారంతో రగిలిపోతున్నవాళ్లు.. హత్యలతో పగ తీరిపోతుంది అనుకుంటున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అన్యాయంగా హత్యలకు పాల్పడుతున్నారు. తర్వాత.. వీళ్లు కూడా జైలు పాలవుతున్నారు. జైలుకు వెళ్లినా పర్వాలేదన్న రీతిలో హత్యలు జరుగుతున్నాయి.

సీసీ కెమెరాలు, సెల్ కెమెరాలు చేతిలో ఉండటంతో ఈ హత్యలన్నీ ఒళ్లు గగుర్పొడిచే రీతిలో ఉంటున్నాయి. అన్నింటినీ మీడియా చానళ్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. పోలీసులు వద్దని చెప్పినా.. పట్టించుకునేది తక్కువే. మీడియాలో విస్తృతంగా జరిగే ప్రచారం వల్లే… కొంత మంది ధైర్యం తెచ్చుకుంటున్నారన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఏదైనా.. ఇప్పుడు తెలంగాణలో.. ఎక్కడైనా నడిరోడ్డు మీద నరికివేతలు జరిగితే.. ఆ.. కామనేగా అనుకునే పరిస్థితి వచ్చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close