బీజేపీతో కోదండరాం చర్చలు..! రాజకీయం ఒంటబట్టించేసుకున్నారా…?

కాంగ్రెస్ పార్టీతో కలిసి మహాకూటమిలో భాగంగా మారి… తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఓడించాలన్న పట్టుదల కనబరిచిన… తెలంగాణ జన సమితి అధినేత ప్రొ.కోదండరాం.. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ.. టీజేఎస్‌కు కేవలం మూడు అంటే.. మూడు సీట్లు మాత్రమే ఇస్తమనే ప్రతిపాదన పెట్టడంతో.. కోదండరాం అసంతృప్తికి గురయ్యారు. వెంటనే తన దగ్గర ప్లాన్ బీ ఉందని చెబుతున్న ఆయన… దాన్ని అమలు కూడా ప్రారంభించారు. బీజేపీ నేతలతో కోదండరామ్ వరుస రహస్యంగా సమావేశం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దత్తాత్రేయతో గంట పాటు చర్చలు జరిపారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

మహాకూటమిలో గెలిచే స్థానాలు వదులుకోకూడదని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ తమకు కనీసం పదిహేడు స్థానాలు కావాలని జనసమితి డిమాండ్ చేస్తోంది. జనసమితికి అంత బలం లేదని .. టిక్కెట్లు ఇస్తే.. చేజేతులా.. టీఆర్ఎస్‌కు అప్పగించినట్లేనన్న ఆందోళన కాంగ్రెస్ పార్టీలోఉంది. కోదండరాంతో చర్చల విషయాన్ని ఆ పార్టీ నేత కిషన్ రెడ్డి… అంగీకరించారు. తెలంగాణ జన సమితితో పొత్తుపై ఇంకా క్లారిటీ రాలేదని, చర్చలు జరుగుతున్నాయని మాత్రం ఆఫ్ ది రికార్డుగా మీడియాకు చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కోదండరాం కీలకపాత్ర పోషించాలనుకుంటున్నారు. కూటమిలో సర్థుకుపోదామనుకున్నా‌‌.. రాబోయే ప్రభుత్వం తన ఆశయాలకు అనుగుణం నడుస్తోన్న గ్యారంటీ లేదు. అందుచేత మహాకూటమికి కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించాలనీ.‌. కూటమిలో చేరుతున్నందుకు పరిహారంగా కామన్ మినిమం ప్రోగ్రాం తయారు చేసే ఛైర్మన్ గా అయినా ఉందామని కోదండరాం ఆశించారు.

కానీకాంగ్రెస్ దీనిపై ఏ విషయమూ చెప్పడం లేదు. అందుకే కోదండరాం ఏం నిర్ణయం తీసుకోవాలా అని ఆలోచిస్తున్నారు. కేసీఆర్ ను ఓడించాలన్న తన ఆశయం నెరవేరాలంటే.. తనొక్కడితో సాధ్యం కాదు. కానీ సీట్ల దగ్గర తేడా వస్తోంది. జనసమితి.. కనీసం 35స్థానాలకు పోటీ చేయాలనుకుంది. కానీ చివరికి 17 స్థానాలకు దిగింది. కాంగ్రెస్ మరీ మూడు స్థానాలు అంటోంది. అందుకే బీజేపీతోనూ చర్చలు జరుపుతున్నారు. కానీ ఆయన స్పందన మాత్రం ఇంకా బయటకు తెలియడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close