9 సంవత్సరాల తర్వాత హిందీలో రీమేక్‌ అవుతున్న తెలుగు సినిమా.!

‘డాలర్‌ డ్రీమ్స్‌’, ‘ఆనంద్‌’, ‘గోదావరి’, ‘హ్యాపీ డేస్‌’, ‘లీడర్‌’, ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలు చేసి డిఫరెంట్‌ కథాంశాలతో సినిమాలు తీసే దర్శకుడుగా పేరు తెచ్చుకున్న శేఖర్‌ కమ్ముల తెలుగు, తమిళ భాషల్లో నయనతారతో రూపొందించిన ‘అనామిక’ చిత్రానికి అనుకున్నంత రెస్పాన్స్‌ రాలేదు. దాంతో కొంత గ్యాప్‌ తీసుకొని ఇప్పుడు బాలీవుడ్‌ వైపు కన్నేశాడు శేఖర్‌. తనకు యూత్‌లో ఎంతో పేరు తెచ్చిన ‘హ్యాపీడేస్‌’ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చెయ్యడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

2007లో రిలీజ్‌ అయిన ‘హ్యాపీడేస్‌’ చిత్రాన్ని దాదాపు 9 సంవత్సరాల తర్వాత హిందీలో రీమేక్‌ చెయ్యాలనుకోవడం వెనుక రీజన్‌ ఏమిటో తెలీదుగానీ ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల మాత్రం ఆ సినిమా కోసం లొకేషన్స్‌ వెతికే పనిలో బిజీగా వున్నాడు. ఈ సినిమా షూటింగ్‌కి అనుకూలంగా వుండే కాలేజీల కోసం నార్త్‌లోని కొన్ని సిటీస్‌ని సందర్శించిన శేఖర్‌.. పూనేలోని ఓ కాలేజ్‌ని సెలెక్ట్‌ చేసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే మరోపక్క నటీనటుల ఎంపిక కూడా స్పీడ్‌గా జరుగుతోందట. కాలేజీలకు సెలవులు ఇచ్చిన తర్వాత మార్చి ఎండింగ్‌లో ఈ సినిమా షూటింగ్‌ని స్టార్ట్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నాడు శేఖర్‌. ఈ చిత్రాన్ని శేఖర్‌ కమ్ముల స్వయంగా నిర్మిస్తుండగా, బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ కూడా ఓ నిర్మాతగా వ్యవహరించే అవకాశం వుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని మాత్రం అఫీషియల్‌గా కన్‌ఫర్మ్‌ చెయ్యాల్సి వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close