రాజకీయాల్లో కొన్ని తప్పులు తెలియకపోయినా చేయకూడదు. కానీ తెలిసి కూడా చేస్తే ఆ పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కేటీఆర్ అలాంటివే చేస్తూంటారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ నుండి కాంగ్రెస్ తరపున గెలిచిన కౌన్సిలర్ ను హైదరాబాద్ పిలిపించుకుని కండువా కప్పేశారు. ఆ మున్సిపాలిటీని దక్కించుకోవడానికి కేటీఆర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బాల్క సుమన్ ద్వారా ఈ ఫిరాయింపులు ప్లాన్ చేస్తున్నారు.
కానీ ఇక్కడ ఒక్క కౌన్సిలర్ కోసం కక్కుర్తి పడితే.. అసలు కాంగ్రెస్ కు దారి చూపించినట్లు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉంది. వారు ఫిరాయింపుకు పాల్పడేలా చేయాలనుకుంటే.. బీఆర్ఎస్ పార్టీ గెలిచిన సీట్లన్నింటిలోనూ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్లే ఉండే అవకాశం ఉంటుంది. కింది స్థాయి క్యాడర్ తో … పార్టీ ఫిరాయించేలా చేయడం ఎంత ఈజీనో గతంలో బీఆర్ఎస్నే చేసి చూపించింది.
ఇప్పుడు కాంగ్రెస్ కౌన్సిలర్ గా మొదటి కండువా కేటీఆర్ కప్పారు కాబట్టి.. ఇక తాము ఎందుకు ఆగాలని కాంగ్రెస్ నేతలు అనుకుంటే.. పదహారో తేదీన మున్సిపల్ చైర్మన్ పీఠాలు..హంగ్ తో ఉన్నవన్నీ కాంగ్రెస్ ఖాతాలో పడిపోతాయి. బీఆర్ఎస్ గెలిచినవీ పడినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే వడ్డేపల్లి మున్సిపాలిటీకి ..సింహం గుర్తుపై గెలిచిన కౌన్సిలర్లంతా కాంగ్రెస్ లో చేరిపోతున్నారు.
