క‌డ‌ప‌లో స్టీల్ ప్లాంట్ ఖాయం అంటున్న జేసీ..!

క‌డ‌ప స్టీల్ ప్లాంటు ఏర్పాటు విష‌య‌మై మ‌రోసారి కేంద్ర‌మంత్రి బీరేంద్ర సింగ్ ని టీడీపీ ఎంపీలు క‌లిసిన సంగతి తెలిసిందే. వీలైనంత త్వ‌ర‌గా ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి సానుకూల ప్ర‌క‌ట‌న ఇవ్వాలంటూ ఎంపీలు ఓ విన‌తి ప‌త్రం అందించారు. నిజానికి, టీడీపీ ఎంపీలు చేస్తున్న ఈ ప్ర‌య‌త్నంతో కేంద్రం అనూహ్యంగా స్పందించేస్తుంద‌న్న విశ్వాసం లేదు! కానీ, ఏదేమైనా ఆంధ్రాలో ఉక్కు క‌ర్మాగారం వ‌చ్చి తీరుతుంద‌ని ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి అన‌డం విశేషం! కేంద్రం ఏమీ ఇవ్వ‌దూ, పొత్తు పెట్టుకోవ‌డ‌మే అన‌వ‌స‌రం అనే విష‌యం మూడేళ్ల కింద‌టే తాను చెప్పాన‌ని అంటుండే జేసీ… క‌డ‌ప ఫ్యాక్టరీ విష‌యంలో ఇలా స్పందించ‌డం ఆస‌క్తిక‌రమే.

క‌డ‌ప స్టీల్ త‌మ‌కు రావాల‌నీ, దాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తే చాలా సంతోషిస్తామ‌నీ, లేదంటే రాష్ట్ర ప్ర‌భుత్వానికి కొన్ని రాయితీలు ఇవ్వాల‌నీ, మైనింగ్ లీజ్ ఇవ్వాల‌ని కోరామ‌న్నారు. అంతేకాదు, ఏపీ ప్ర‌భుత్వంతోపాటు ప్రైవేటు భాగ‌స్వామ్యంలో ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేసుకునే విధంగానైనా వెసులుబాటు ఇవ్వాల‌ని కోరామ‌న్నారు. కాబ‌ట్టి, ఏదో ఒక విష‌య‌మై తేల్చాలంటూ కేంద్రానికి ఆప్ష‌న్లు ఇస్తే… కేంద్రమంత్రి సానుకూలంగానే స్పందించార‌నీ, ఓవారం రోజులు లోపుగా ఒక ప్ర‌క‌ట‌న చేస్తాన‌ని హామీ ఇచ్చిన‌ట్టు జేసీ చెప్పారు. ఏదో ఒక రూపంలో క‌డ‌ప‌లో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేస్తామ‌నే ఆశాభావం ఆయ‌న క‌న‌బ‌ర్చారు అన్నారు. త‌మ ప‌ట్టుద‌ల‌కు ఒక ప్ర‌తిఫ‌లం ఉంటుంద‌నీ, ఏదేమైనా క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ చూస్తామ‌న్నారు.

జేసీకి ఇంత న‌మ్మ‌కం ఎలా క‌లిగిందో తెలీదుగానీ… క‌డ‌ప ఉక్కు క‌ర్మాగారం ఆల‌స్యం కావ‌డానికి కార‌ణం కేవలం రాజ‌కీయ కార‌ణాలు మాత్ర‌మే క‌దా! ఇంకోటి.. వారం లోగా ఏదో ఒక ప్ర‌క‌ట‌న చేస్తామ‌ని బీరేంద్ర సింగ్ హామీ ఇచ్చార‌నీ జేసీ అంటున్నారు. ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు గ‌తంలో కూడా చాలానే చూశాం. సుప్రీం కోర్టులో కేంద్రం ఫైల్ చేసిన అఫిడ‌విట్‌ను కూడా చూశాం! ఇవ‌న్నీచూశాక‌.. వారంలోగా క‌డ‌ప ప్లాంట్ విష‌య‌మై ఏదో అనూహ్య ప్ర‌క‌ట‌న వెలువడితే అద్భుత‌మే! ఫ్యాక్ట‌రీ ఎందువ‌ల్ల సాధ్యం కాదు… అనే అంశంపై గ‌తంలో కేంద్ర‌మే కొన్ని కార‌ణాలు చూపించింది. ఉన్నట్టుండి ఈ అభ్యంత‌రాల‌న్నీ తొల‌గిపోయి.. ఫ్యాక్ట‌రీ ఏర్పాటుకు సానుకూల ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని జేసీ బ‌లంగా న‌మ్ముతారు మరి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

ఇదేం టైటిల్ రౌడీ బోయ్‌…?

సంతోషం స‌గం బ‌లం అంటారు. సినిమాకు టైటిల్ కూడా అంతే. టైటిల్ ఎంత క్యాచీగా, ఎంత కొత్త‌గా ఉంటే అంత ప్ల‌స్సు. అందుకే టైటిల్ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డిపోతూ...

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఫిక్స్ అయిపో..!?

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. ముద్రగడ ధీమా ఏంటో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close