బయోపిక్స్ అంటే మొహం మొత్తేస్తుందేమో !

బయోపిక్స్ ట్రెండ్ ని బాలీవుడ్ మొదలుపెట్టిందని చెబుతుంటారు. కానీ ఇండియన్ మోడరన్ ఎరా సినిమాలో దిగ్దర్శకుడు మణిరత్నం దీనికి ఆద్యుడు. ‘ఇద్దరు’ పేరుతో ఓ గొప్ప బయోపిక్ తీశాడు మణిరత్నం. కమర్షియల్ సక్సెస్ ని పక్కనపెడితే మణిరత్నం తీసిన గొప్ప సినిమాల లిస్టు లో ఉటుందీ సినిమా. ఒకే సమయంలో ఎంజీఆర్, కరుణానిధిల జీవితాల్ని ఇందులో ఆవిష్కారించాడు. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తుంటే ఛానల్ మార్చరు ‘సినిమా’ని అభిమానించే జనాలు. అయితే అప్పట్లో ఈ జోనర్ మళ్ళీ ముందుకు తీసుకుపోయే ప్రయత్నం ఎవరూ చేయలేదు. మళ్ళీ చాల రోజుల తర్వాత ఆయనే ‘గురు’ రూపంలో మరో బయోపిక్ తీశాడు. బిజినెస్ టైకూన్ ధీరుబాయి అంబానీ ప్రయాణమే గురు సినిమా. ఇది కూడా బావుటుంది. ఈ సినిమా వచ్చిన చాలా రోజుల తర్వాత బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ బయోపిక్స్ జోరు మొదలుపెట్టారు.ఈ వరుసలో భాగ్ మీకా, డర్టీ పిక్చర్ , పాన్ సింగ్ తోమార్, ఎంఎస్ ధోని, అజార్, మేరీ కొమ్, దంగల్, నీరాజా .. ఇలా బోలెడు సినిమాల వచ్చేశాయి.

అయితే బయోపిక్ రుచిని తెలుగు ప్రేక్షకులకు చూపించిన క్రెడిట్ నాగ్ అశ్విన్ కి దక్కుతుంది. మహానటితో మొదటి ప్రయత్నంలోనే ఓ క్లాసిక్ ని అందించాడు నాగ్ అశ్విన్. సావిత్రమ్మ జీవితాన్ని భావితరాలకు ఒక మర్చిపోలేని బహుమతిగా ఇచ్చాడు. మహానటి జీవితాన్ని ఒక అద్భుతమైన దృశ్యంగా మలచాడు. దీంతో టాలీవుడ్ లో కూడా బయోపిక్స్ ఆడుతాయనే నమ్మకాన్ని ఇచ్చాడు. అయితే ఈ సినిమా తర్వాత కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి బయోపిక్ ప్రకటనలు. ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్, లక్ష్మి పార్వవతి బయోపిక్, చంద్రబాబు బయోపిక్, ఘంటశాల, కత్తి కాంతారావు, శోబన్ బాబు, కే విశ్వనాద్, పుల్లెల గోపీచంద్.. ఇలా అన్నీ బయోపిక్ ప్రకటనలే. అయితే ఇందులో చాలా వాటికి ఎవరు వర్క్ చేస్తున్నారు. దాన్ని ఎంత ఎఫెక్టివ్ గా తీస్తారో తెలీదు.

ఇందులో ఎన్టీఆర్, వైఎస్ బయోపిక్స్ పైనే మంచి అంచనాలు వున్నాయి. మిగతావి ఎలా వస్తాయో తెలీదు. ప్రముఖుల పేర్లు వాడుకోవడం తప్పితే వారి జీవితాలకు వెండితెర రూపం ఇవ్వడంలో ఎంతవరకు సక్సెస్ అవతారో క్లారిటీ లేదు. ఇందులో ఒక్క బయోపిక్ తేడా కొట్టినా మిగతావాటికి ఆదరణ దగ్గిపోయే ఛాన్స్ వుంది. అయితే ఇలా కేవలం తెలుగు ప్రముఖుల ఇమేజ్ తోనే కాకుండా దేశవ్యాప్తంగా వున్న ప్రముఖులు, చరిత్రలో నమోదైన కీలక సంఘటనలకు వెండితెర రూపం ఇస్తే టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినిమా మొత్తాన్ని ఆకట్టుకొనే ఆవకాశం వుంది. ఉదాహరణ కు ‘దంగల్’అని రెజ్లర్ గీతా ఫోగాట్ జీవితాన్ని సినిమాగా తీస్తే తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరించారు కదా. అలాగే ధోని, బాగ్ మీకా, డర్టీ పిక్చర్ లాంటి సినిమాలు బోలెడు ఆదరణ లభించింది. మరి ఈ దిశగా టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆలోచిస్తే బావుటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close