ఐటీ వాళ్లు తీసుకెళ్లినవి ఇవే: సీఎం రమేష్

మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ ఇల్లు, ఆయనకు సంబంధించిన రిత్విక్ ప్రాజెక్ట్స్ కార్యాలయాలు, ఆయన బంధువుల ఇళ్లు, చిన్ననాటి స్నేహితుల ఇళ్లలో మూడు రోజుల పాటు.. జరిపిన సోదాలు ముగిశాయి. ఏమేమి దొరికాయన్నదానిపై ఐటీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయకుండా వెళ్లిపోయారు. కానీ.. ఐటీ దాడుల విషయంలో.. సీఎం రమేష్.. వెంటనే మీడియా ముందుకొచ్చారు. ఐటీ అధికారులు ఎలాంటి ప్రకటనలు చేయకపోయినా… మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకట్ట వేయడానికి… ఐటీ సోదాల వివరాలన్నింటినీ బయటపెట్టారు. ఐటీ అధికారులు మూడు రోజుల పాటు సోదాలు చేసి.. స్వాధీనం చేసుకున్న వాటి గురించి… ఐటీ అధికారులు ఇచ్చిన పంచనామా పత్రాలను బయటపెట్టారు.

అచ్చంగా రేవంత్ రెడ్డి ఇంట్లో సోదాలు ప్రారంభమైనప్పుడు.. ఆయనకు విదేశాల్లో వేల కోట్ల ఆస్తులున్నాయని… ప్రచారం జరిగినట్లే.. సీఎం రమేష్ విషయంలోనూ అలాగే ప్రచారం జరిగింది. ముఖ్యంగా… ఓ సెక్షన్ మీడియా… సీఎం రమేష్‌ను పూర్తిగా టార్గెట్ చేసింది. సాక్షి మీడియా, ఎన్టీవీలో.. సీఎం రమేష్ ఇంట్లో వేల కోట్లు దొరికాయని.. వేల కోట్లు తరలించారని కథనాలు ప్రసారం చేశారు. ఇదంతా ప్లాన్డ్‌గా జరిగిన ప్రచారం అని ఆరోపిస్తున్న సీఎం రమేష్.. మొత్తం విషయాలను బయటపెట్టారు. తన ఇంట్లో, బంధువుల ఇంట్లో… సోదాలు చేసి.. కేవలం రూ. 3.53 లక్షల రూపాయలు మాత్రమే స్వాధీనం చేసుకున్నారని… ఐటీ అధికారులు ఇచ్చిన పంచనామా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కీలక పత్రాలంటూ… జగన్ అనుకూల మీడియాలో ప్రచారం చేస్తున్న కీలక పత్రాలు.. తన కుటుంబసభ్యులు బ్యాంక్ పాస్‌బుక్‌లేనని… వీటిని స్వాధీనం చేసుకున్నట్లు… ఐటీ అధికారులు ఇచ్చిన పత్రాన్ని కూడా మీడియాకు విడుదల చేశారు. ఇక హార్డ్ డిస్క్ కూడా తీసుకెళ్లారని.. అందులో తన కుమారుడు చూడటానికి ఉంచుకున్న సినిమాలు మాత్రమే ఉన్నాయని.. ఆ జాబితాను కూడా రాసుకున్నారన్నారు. తన వేలి ముద్రతోనే ఓపెన్ అయ్యే డిజిటల్ లాకర్ విషయంలోనూ…. సాక్షి మీడియాలో చేసిన ప్రచారంపై మండిపడ్డారు. అందులో బట్టలు మాత్రమే ఉన్నాయన్నారు.

ఓటుకు నోటుకు సంబంధించిన రూ. 50లక్షలు అలహాబాద్ బ్యాంక్ నుంచి వచ్చాయని… అందుకే.. ఆ బ్యాంక్‌లో సోదాలు చేశారని ప్రచారం చేశారని.. అసలు అలహాబాద్ బ్యాంక్‌లో అకౌంట్‌ కూడా లేదని … స్పష్టం చేశారు. తన భార్యపై.. ఐటీ వారెంట్లు తీసుకుని వచ్చారని.. అసలు తన భార్య రిత్విక్ అగ్రోఫార్మ్స్‌లో డైరక్టరే కాదని.. అయినా.. ఆమె పేరుతో వారెంట్ తీసుకొచ్చారంటేనే.. కుట్ర ఉందని…స్పష్టమవుతోందన్నారు. ఆరేళ్ల క్రితం ఖాళీ చేసిన ఢిల్లీ కార్యాలయం… మూడేళ్ల క్రితం.. ఖాళీ చేసిన బెంగళూరు కార్యాలయంలోనూ సోదాలకు వెళ్లారని… ఇది వేధింపులు కాదా.. అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందురు పోరాడుతారని.. తన కుటుంబసభ్యులతో ఐటీ అధికారులు బెదిరింపు ధోరణితో మాట్లాడారని… ఇది రాజకీయ కుట్ర కాదా అని ప్రశ్నించారు. ఎంత వేధింపులకు పాల్పడినా… తాను మాత్రం కేంద్రంపై పోరాటం ఆపబోనని ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close