చరణ్‌ చిత్రంలోనూ ‘నరసింహా స్వామి’ సెంటిమెంట్‌!

లక్ష్మీనరసింహస్వామి అంటే దర్శకుడు బోయపాటి శ్రీనుకి ఎంతో భక్తి! ఓ రకంగా చెప్పాలంటే ఆయనకు సింహా అనేది సెంటిమెంట్‌ కూడా!! సెంటిమెంట్‌ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే… ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సందర్భంలో, సన్నివేశంలో లక్ష్మీనరసింహాస్వామి ప్రస్తావన వుండేలా బోయపాటి చూసుకుంటున్నారు. ఉదాహరణకు… సింహా, లెజెండ్‌ సినిమాల్లో టెంపుల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సన్నివేశాలు లేదా ఫైట్లు తీశారు. సరైనోడులోనూ టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌ ఫైట్ వుంటుంది. కానీ, అక్కడ నరసింహస్వామి అని చూపించలేదనుకోండి. ప్రస్తుతం రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమాలోనూ టెంపుల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సన్నివేశాలు తీశారు. అదీ విశాఖలోని సింహాచలంలో గల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో!! రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా చిత్రీకరణ ఆదివారం సింహాచల వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరిగింది. రామ్‌చరణ దర్శనం కోసం వెళుతున్న సన్నివేశాలను, మాడవీధుల్లో పల్లకీసేవ సన్నివేశాలను, ఆనంతరం భక్తులకు ప్రసాదాలు పంచిపెడుతున్న సన్నివేశాలను బోయపాటి చిత్రీకరించారు. చరణ్‌తో పాటు స్నేహ, ఆర్యన్‌ రాజేశ్‌, ప్రశాంత్‌ తదితరులు షూటింగులో పాల్గొన్నారు. వచ్చే యేడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close