పవన్ కల్యాణ్ చిరంజీవి తమ్ముడా..? కానిస్టేబుల్ కొడుకా..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. “కానిస్టేబుల్ కొడుకు సీఎం కాకూడదా..” అని రాజమండ్రి కవాతులో తనకు అలవాటైన హైపిచ్‌లో డైలాగులు సంధించారు. భారత ప్రజాస్వామ్య గొప్పదనం ఏమిటంటే… ప్రజల మద్దతు ఎవరు పొందితే వారే.. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సహా.. ఏ పదవి అయినా పొందగలుగుతారు. వారు చాయ్ వాలాగా చేసి వచ్చారా..? కానిస్టేబుల్ కడుపున పుట్టాడా..? పేద తల్లి కొడుకా..? అన్నది మ్యాటరే కాదు. ఇంకా చెప్పాలంటే… అది అర్హత కూడా కాదు…!

కానిస్టేబుల్ కొడుకవడం అర్హతనా..?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తనపై రాజకీయంగా విమర్శలు వచ్చినప్పుడు తాను పేదతల్లి కొడుకునని.. తనను దింపేయడాని అందరూ కలసి కుట్రలు పన్నుతున్నారని చెప్పుకుని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మోడీ చూసి ఇన్‌స్పయిర్ అయ్యారేమో కానీ.. పవన్ కల్యాణ్ కూడా .. తరచూ తాను కానిస్టేబుల్ కొడుకునని.. తనకు సీఎం అయ్యే అర్హత లేదా అని ప్రశ్నిస్తున్నారు. పేద తల్లి కొడుకు అయినందునే..మోడీని ప్రధానమంత్రిని చేయలేదు. దేశంలో ఉన్న 120 కోట్ల మందిలో 100 కోట్ల మంది పేదతల్లి బిడ్డలే. అందరూ ప్రధానమంత్రి కాలేదు. నరేంద్రమోడీ… విమర్శలున్నా.. తన మార్క్ రాజకీయాలు చేసి.. ఆ స్థాయికి వచ్చారు. ఈ విషయంలో ఆయనది కచ్చితంగా విజయమే. కానీ పవన్ కల్యాణ్ తాను కానిస్టేబుల్ కొడుకునని ఎలా చెప్పుకుంటారు..?. అదే తన అర్హతన్నట్లుగా ఎందుకు హైలెట్ చేసుకుంటున్నారు..?

కానిస్టేబుల్ కొడుకుగానే కీర్తి సాధించారా..?

పవన్ కల్యాణ్ తన తండ్రి.. కానిస్టేబుల్‌గా పని చేస్తూ.. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతూంటే.. ఆ తండ్రి కష్టాన్ని గౌరవించి.. ఆయన చెమట చుక్కలకు విలువ ఇస్తూ.. ఆయన సంపాదనతో…చదివిన చదువులు ఏమైనా న్యాయం చేసి ఈ పొజిషన్‌కు వచ్చారా..? . కానిస్టేబుల్‌గా పని చేసిన నాన్న ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ.. తన కష్టంతో ఎదిగి ఇప్పుడు ఉన్న పొజిషన్‌కు వచ్చారా..?. నిజానికి నేను కానిస్టేబుల్ కొడుకును అని చెప్పుకునే అర్హత.. వంత శాతం చిరంజీవికే ఉంది. ఆయన మాత్రమే… సాధారణ కానిస్టేబుల్ కుమారుడిగా.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి… అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ అయ్యారు. అచ్చంగా సన్నాఫ్ కానిస్టేబుల్ అనే ట్యాగ్ పూర్తిగా చిరంజీవికే అంకితం. కానీ పవన్ కల్యాణ్… కానిస్టేబుల్ కుమారుడిగా మాత్రం.. ఎదగలేదు..!

పవన్ కల్యాణ్ చిరంజీవి తమ్ముడు మాత్రమే..!

పవన్ కల్యాణ్ చిరంజీవి తమ్ముడు కాకుండా.. కేవలం.. కానిస్టేబుల్ కొడుకు మాత్రమే అయి ఉంటే.. ఈ రోజు ఎక్కడ ఉండేవారు..? సినిమా హీరో అయ్యేవారా..? ఆ హీరోయిజంతో వచ్చిన క్రేజ్‌ను అడ్డం పెట్టుకుని రాజకీయ పార్టీని స్థాపించి ఉండేవారా..? చాన్సే లేదు… పవన్ కల్యాణ్ హీరో అయినా.. రాజకీయ పార్టీ స్థాపించినా.. అది పూర్తిగా.. చిరంజీవి వారసుడిగానే. మెగాస్టార్ సోదరుడిగానే… పవన్ కల్యాణ్‌కు సినిమా అవకాశాలొచ్చాయి. రాజకీయ అవకాశాలొచ్చాయి. వాటితోనే ఆయన ఇప్పుడు తన భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. అంతే తప్ప.. కానిస్టేబుల్ కొడుకునని చెప్పుకునే అర్హత పవన్ కల్యాణ్‌కు లేదు.

అన్నయ్యను అవమానించినట్లేనా..?

అన్నయ్య నీడలా ఎదిగిన పవన్ కల్యాణ్… తన ఉన్నతిలో.. తన విజయంలో… ఎవరి పాత్ర లేదన్నట్లుగా.. కేవలం … తాను కానిస్టేబుల్ కొడుకు నుంచి ఈ స్థాయికి ఎదిగినట్లుగా.. పదే పదే చెప్పుకోవడం అన్నయ్యను అవమానించినట్లే. పవన్ కల్యాణ్.. జీవితంలో వేసిన ప్రతి అడుగు వెనుక స్ఫూర్తి.. దీప్తి … చిరంజీవే. ఆయననే ఎప్పుడూ గుర్తు చేసుకోవాలి. అలా కాకుండా.. తాను స్వయంకృషితో ఎదిగినట్లు… ఓ సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా తన ప్రస్థానాన్ని ఇలా ప్రజల ముందు ఇలా కార్లలో కవాతులు చేసే స్థాయికి పెంచుకున్నానని చెప్పుకోవడం… కచ్చితంగా అన్నను అవమానించడమే..!

చివరికి పవన్ కల్యాణ్.. కానిస్టేబుల్ కొడుకు కాదు..! చిరంజీవి తమ్ముడు మాత్రమే..!!

— సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ ను రేసులో నిలబెడుతోన్న రేవంత్..!!

రేవంత్ రెడ్డి...ఈ పేరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. వ్యుహమో మరేమో కానీ, రిజర్వేషన్లపై కుట్ర జరుగుతుందంటూ బీజేపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యల పుణ్యమా అని బీజేపీ జాతీయ...

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close