సీబీఐ ఛీఫ్ కీ టీడీపీకి లింకు పెట్టిన సాక్షి!

సీబీఐ కొత్త డైరెక్ట‌ర్ గా నాగేశ్వ‌రావుని హుటాహుటిన నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. అలోక్ వ‌ర్మ‌, రాకేష్ ల మ‌ధ్య త‌లెత్తిన వివాదం నేప‌థ్యంలో… ఆ ఇద్ద‌ర్నీ ఇంటికి పంపేసి… నాగేశ్వ‌ర‌రావుని నియ‌మించారు. అయితే, ఈ నియామ‌కాన్ని వైకాపా ప‌త్రిక సాక్షి ఎలా చూస్తోందంటే… ప్ర‌ధాని మోడీ, సీఎం చంద్ర‌బాబు నాయుడుల మ‌ధ్య ఉన్న ర‌హ‌స్య సంబంధానికి మ‌రో ప్ర‌తీక అంటూ ఓ క‌థ‌నం అచ్చేశారు! సీబీఐ ఛీఫ్ గా నియ‌మితులైన నాగేశ్వ‌ర‌రావుకూ చంద్ర‌బాబు నాయుడుకీ స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ… ఓ బీర‌కాయ పీచు లింకేదో పెట్టే ప్ర‌య‌త్నం చేశారు.

నాగేశ్వ‌ర‌రావుపై ఇప్ప‌టికే కొన్ని ఆరోప‌ణ‌లున్నాయ‌నీ, ఆదాయానికి మించిన ఆస్తులున్న‌ట్టుగా కొన్ని ఫిర్యాదులు కూడా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఆయ‌న నియామ‌కంపై ప్ర‌శాంత్ భూష‌ణ్ లాంటివాళ్లు కూడా విమ‌ర్శిస్తున్నార‌నీ, ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న అధికారిని తీసుకొచ్చి ఇంత కీల‌క‌మైన స్థానంలో ఎలా కూర్చోబెడ‌తార‌ని ప్ర‌శాంత్ భూష‌ణ్ అంటున్నారంటూ రాశారు. దీంతోపాటు, నాగేశ్వ‌ర‌రావు నియామ‌కంపై ఢిల్లీ రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్రంగా చ‌ర్చ జ‌రిగిపోతోంద‌ట‌..! అదేంటంటే… ఈ నాగేశ్వ‌ర‌రావుకు టీడీపీకి చెందిన కొంత‌మంది కీల‌క నాయ‌కుల‌తో స్నేహం ఉంద‌ట‌, టీడీపీలో కొంత‌మంది నేత‌ల‌పై కూడా అవినీతి ఆరోప‌ణ‌లున్నాయ‌ట‌, అవి కూడా విచార‌ణ ద‌శ‌లో ఉన్నాయ‌ట‌, ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు నాయుడుకి సన్నిహిత సంబంధాలున్న వ్య‌క్తిని ద‌ర్యాప్తు సంస్థ ఛీఫ్ గా నియ‌మించ‌డం వెన‌క మ‌త‌ల‌బు ఏదో ఉంద‌నే చ‌ర్చ ఢిల్లీలో జ‌రుగుతోంద‌ట‌! భాజ‌పాపై టీడీపీ ఎన్ని విమ‌ర్శలు చేస్తున్నా… లోప‌యికారీగా ఆ రెండు పార్టీలూ ఒకటే అని చెప్ప‌డానికి ఈ నియామ‌కం ఒక నిద‌ర్శ‌నం అని రాసేశారు. మ‌రోసారి భాజ‌పాకు చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌య్యేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నంలో భాగంగా దీన్ని చూడాల‌ట‌… అదేంటో మ‌రి!

ఇంకా న‌యం… అలోక్ వ‌ర్మ, రాజేష్ ల‌ను తొల‌గించే ముందు చంద్ర‌బాబుకి మోడీ ఫోన్ చేశార‌ని రాయ‌లేదు! సాక్షి వ‌రుస చూస్తే అలాగే ఉంది. నాగేశ్వ‌ర‌రావు నియామ‌కంతో చంద్ర‌బాబు నాయుడుకి ఏంటి సంబంధం..? టీడీపీలో ఎవ‌రో కీల‌క నేత‌కు నాగేశ్వ‌ర‌రావు తెలిసినంత మాత్రాన‌… ఏపీ సీఎంకి ఆయ‌న ఎలా అత్యంత స‌న్నిహితుడు అవుతారు..? స‌రే, ఒక‌వేళ స‌న్నిహితుడే అనుకున్నా… నాగేశ్వ‌ర‌రావును కేంద్రం నియ‌మిస్తే, మ‌ధ్య‌లో చంద్ర‌బాబు ఏం చేస్తారు..? సీబీఐ ఛీప్ గా నాగేశ్వ‌ర‌రావు నియామ‌కాన్ని… భాజ‌పాకు చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నంగా ఎలా చెప్తారు..? ఈ రెండింటికీ ఉన్న సంబంధ‌మేంటి? ఇంకోటి… ఏపీ విష‌యంలో అడుగ‌డుగునా కేంద్రం మోకాల‌డ్డుతున్న తీరు స్ప‌ష్టంగా క‌నిపిస్తూ ఉంటే… ఈ రెండు పార్టీల మ‌ధ్య ర‌హ‌స్య స్నేహం ఉంద‌ని సాక్షి ఇంకా చెబుతూ ఉంటే ఏమ‌నుకోవాలి..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close