ఎన్టీఆర్ బ‌యోపిక్‌: రానా.. ఒక్క సీనుకే ప‌రిమిత‌మా?

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో రానా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో రానా క‌నిపిస్తాడ‌న‌గానే ఈ సినిమాకి తొలిసారి మ‌ల్టీస్టార‌ర్ లుక్ వ‌చ్చింది. ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో అడుగుపెట్టిన తొలిస్టార్ కూడా రానానే. అయితే రానా పాత్ర గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఈ సినిమాలో రానా పాత్ర కేవ‌లం ఒక్క స‌న్నివేశానికే ప‌రిమితం అని తెలిసింది. అయితే ఆ ఒక్క సీన్ చాలా కీల‌క‌మ‌ట‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగు దేశం జెండాతో గెలిచిన ఎమ్మెల్యేల్ని ఢిల్లీ తీసుకెళ్లి బ‌ల‌నిరూప‌ణ చేయ‌డంలో అప్ప‌ట్లో నారా చంద్ర‌బాబు నాయుడు పాత్ర కీల‌కం. ఎం.ఎల్‌.ఏల‌ను ర‌హ‌స్యంగా రైలులో ఢిల్లీ త‌ర‌లించారు. వారితో పాటు చంద్ర‌బాబు నాయుడు కూడా ఉన్నాడు. మ‌ధ్య‌లో దారిలో కాంగ్రెస్ కార్య‌కర్త‌లు కొంత‌మంది దాడి చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తే.. అందులోంచి కూడా క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు.ఈ టోట‌ల్ ఎపిసోడ్ ఓ యాక్ష‌న్ ఘ‌ట్టాన్ని త‌లపిస్తుంది. ఈ సీన్ లోనే రానా క‌నిపిస్తాడు. రానాతో మ‌రో రెండు సన్నివేశాల్ని తెర‌కెక్కించిన‌ప్ప‌టికీ.. వాటిని ప్ర‌స్తుతానికి ప‌క్క‌న పెట్టేశార‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్ బ‌యోపిక్ క‌థానాయ‌కుడు, మ‌హా నాయ‌కుడు అనే రెండు భాగాలుగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. క‌థానాయ‌కుడుకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్త‌యింది. మ‌హానాయ‌కుడు పార్ట్ కూడా దాదాపు స‌గానికి పైగా పూర్తి చేసుకుంది. మ‌హా నాయకుడు పార్ట్ లోనే రానా క‌నిపిస్తాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇప్పుడు ఏపీ మద్యం దుకాణాల్లో నో క్యాష్ పాలసీ !

నిన్నామొన్నటిదాకా క్యాష్ తప్ప మరో డిజటల్ పేమెంట్ తీసుకోలేదు ఏపీ మద్యం దుకాణాల్లో. ఇప్పుడు పాలసీ ఒక్క సారిగా మారిపోయింది. శుక్రవారం నుంచి ప్రభుత్వం పాలసీ మార్చేసింది. డిజిటల్ పేమెంట్...

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే ఏపీకి ఏం ఉపయోగం !?

విభజన చట్టంలో ఉన్న ఉమ్మడి రాజధాని అంశానికి జూన్ రెండో తేదీన ముగింపు రాబోతోంది. మరోసారి పొడిగింపు అసాధ్యం అని తెలిసినా సరే కొంత మంది ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలనే...

డ్రగ్స్ పార్టీ కేసు వైసీపీ చుట్టే తిరుగుతోంది !

డ్రగ్స్ అంటే వైసీపీ పేరు ఖచ్చితంగా వస్తోంది. ఏదో ఆషామాషీగా మీడియాలో వచ్చే కథనాలు కాదు. నేరుగా పోలీసు కేసుల్లో ఇరుక్కుంటున్నవారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఏ 2గా నిలిచిన...

పల్లీబఠాణి కామెంట్స్‌తో రాకేష్ రెడ్డిని ముంచిన కేటీఆర్

బిట్స్ పిలానీ గొప్ప కావొచ్చు కానీ మిగతా గ్రాడ్యూయేట్స్ అంతా పల్లీ బఠాణీలు అంటే ఎలా ?. కేటీఆర్ ఇది ఆలోచించలేదు. ప్రాస బాగుంది కదా అని అనేశారు. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close