పెళ్లి గేమ్‌లో పాండ్యా హిట్ వికెట్ అయ్యాడా ? తెలివిగా తప్పించుకున్నాడా ?

క్రికెటర్ హార్జిక్ పాండ్యా ఇప్పుడు హాట్ టాపిక్. ముంబైకి కెప్టెన్ గా ఆయన భయంకరమైన ట్రోల్స్ ఎదుర్కొన్నారు. అదే సమయంలో ముంబై టాప్ ఫోర్ కు చేరుకోలేకపోయింది. ఆ షాక్‌లో ఉండగానే ఆయన భార్యతో విడాకులు తీసుకుంటున్నారని.. ఆస్తుల్లో 70 తన భార్య నటాషాకు ఇచ్చేస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది.

అధికారికంగా పాండ్యా కానీ నటాషా కానీ విడాకుల గురించి ప్రకటన చేయలేదు.. కానీ విడాకులు మాత్రం నిజమేనని వారి సన్నిహితులు చెబుతున్నారు. కానీ 70 శాతం ఆస్తి రాసిస్తున్నాడన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు. హార్దిక్ పాండ్యా మధ్య తరగతి కుటుంబం నుంచి క్రికెట్ లోకి వచ్చారు. తాము ఎదుర్కొన్న కష్టాల గురించి ఆయన చాలా ఇంటర్యూల్లో చెప్పారు. అయితే క్రికెటర్ గా మారిన తర్వాత ఆయన లైఫ్ స్టైల్ మాత్రం చాలా లగ్జరీగా ఉంది.

ఈ క్రమంలో సెర్బియాకు చెందిన డాన్సర్ నటాషా స్టాంకోవిక్ తో ప్రేమలో పడ్డారు. బాలీవుడ్ లో అవకాశాల కోసం ముంబై వచ్చిన నటాషా కొన్ని బ్రేకప్‌ల తర్వాత హార్జిక్ పాండ్యాతో ప్రేమలో పడింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాతనే వీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి పాండ్యా కుటుంబసభ్యులు కూడా వెళ్లలేదని చెబుతారు. అయితే హఠాత్తుగా డైవోర్స్ విషయం వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజులుగా వీరు కలిసి కనిపించడం లేదు. ఐపీఎల్ లో నటాషా కనిపించలేదు. సోషల్ మీడియాలో కలిసి దిగిన ఫోటోలు అప్ లోడ్ చేయడం ఆపేశారు.

విడాకుల గురించి ఎవరికీ ఆశ్చర్యం లేకున్నా 70 శాతం భార్యకు రాసివ్వాల్సి వస్తోందన్న దానిపై మాత్రం విస్తృత చర్చ జరుగుతోంది. కానీ హార్జిక్ పాండ్యా ఓ ఇంటర్యూలో తనకు అసలు అస్తులేమీ లేవని.. అన్ని ఆస్తులు తన తల్లి పేరు మీద ఉంటాయని చెప్పిన వీడియో కూడా వైరల్ అవుతోంది. దీన్ని హైలెట్ చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ తెలివిగా తప్పించుకున్నాడని అంటున్నారు.

అసలు విడాకులపై పాండ్యా – నటాషా అధికారిక ప్రకటన చేస్తే క్లారిటీ వస్తుంది . చేసినా ఆస్తుల పంపకం గురించి బయటకు చెప్పకపోవచ్చు..ఎప్పటికీ రూమర్ గానే మిగిలిపోయే చాన్స్ ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణ గవర్నర్ గా కిరణ్ కుమార్ రెడ్డి..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ గవర్నర్ గా నియమించాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నారా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో సంచలన...

12 క‌థ‌లు రిజెక్ట్ చేసిన మెగా హీరో!

కెరీర్ ముందు నుంచీ క‌థ‌నే న‌మ్ముకొని ప్ర‌యాణం చేస్తున్న మెగా హీరో వ‌రుణ్‌తేజ్‌. ఈ క్ర‌మంలో కొన్ని ప్ర‌యోగాలూ చేశాడు. ఎదురు దెబ్బ‌లూ తిన్నాడు. గ‌ని, గాంఢీవ‌ధారి అర్జున‌, ఆప‌రేష‌న్ వాలెంటైన్ వ‌రుణ్...

బ్యాన‌ర్‌ని న‌మ్ముకొని న‌లిగిపోతున్న ద‌ర్శ‌కుడు

తొలి సినిమాతోనే హిట్టు కొట్టిన ద‌ర్శ‌కుడు...అనుదీప్‌. 'జాతిర‌త్నాలు' సినిమాతో కామెడీలో ఓ ట్రెండ్ సృష్టించాడు. 'ప్రిన్స్' కూడా త‌న మార్క్ వినోదాన్ని పంచి పెట్టింది. అయితే ఆ త‌ర‌వాత త‌న నుంచి మ‌రో...

‘క‌ల్కి’.. రెండు కాదు… నాలుగు

బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ ది ఇయ‌ర్ గా అంద‌రి నోళ్ల‌లో నానుతున్న సినిమా 'కల్కి'. గ‌త కొంత కాలంగా స‌రైన విజ‌యం లేక‌, బాక్సాఫీసు స్త‌బ్దుగా ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ కాస్త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close