ఇప్పుడు ఏపీ మద్యం దుకాణాల్లో నో క్యాష్ పాలసీ !

నిన్నామొన్నటిదాకా క్యాష్ తప్ప మరో డిజటల్ పేమెంట్ తీసుకోలేదు ఏపీ మద్యం దుకాణాల్లో. ఇప్పుడు పాలసీ ఒక్క సారిగా మారిపోయింది. శుక్రవారం నుంచి ప్రభుత్వం పాలసీ మార్చేసింది. డిజిటల్ పేమెంట్ చేస్తేనే మద్యం ఇస్తామని వైన్‌షాప్‌ ఉద్యోగులు చెబుతున్నారు. డబ్బులు ఇస్తామంటే మద్యం అమ్మడం లేదు. హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

నిరుపేద మందు బాబులకు తమ సంపాదన అంతా మద్యానికి పెడతారు కానీ.. స్మార్ట్ ఫోన్ వాడేంత సీన్ ఉండదు. వారికి కూడా డబ్బులు తీసుకుని మద్యం ఇవవడం లేదు. సాయంకాలం పని పూర్తి చేసుకుని, శరీర కష్టం నుంచి ఉపశమనానికి మద్యం తాగే అలవాటున్న వారంతా, క్వార్టర్‌ మందు కోసం క్యూలైన్‌లో నిలబడితే, లేనిపోని నిబంధనలు పెట్టి మందు లేదనేసరికి వారంతా చిర్రెత్తిపోతున్నారు. దీనికి కారణం ఉన్నతస్థాయి నుచి వచ్చిన ఆదేశాలే.

ప్రభుత్వం మారే పరిస్థితులు కనిపిస్తూండటం.. మద్యం స్కాం అతి పెద్దదని.. కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే నిర్వహించడం వెనుక అతి పెద్ద స్కాం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. ఎన్ని ఆరోపణలు చేసినా .. కోర్టుల్లో పిటిషన్లు వేసినా, కేంద్రానికి ఫిర్యాదు చేసినా .. డిజిటల్ పేమెంట్స్ పెట్టమని చెప్పి తప్పించుకున్నారు తప్ప.. అమలు చేయలేదు. అరకొరగా అమలు చేశారు. ఇప్పుడు హఠాత్తుగా మొత్తం డిజిటల్ పేమెంట్స్ మాత్రమేనని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ నేతలకు గేట్లు క్లోజ్!

ఏపీలో వైసీపీ ఘోర పరాజయంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు నేతలు రెడీ అవుతున్నారా..? ఇప్పటికే పార్టీ మార్పుపై కొంతమంది టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్ళారా..? ఐదేళ్ళు టీడీపీ నేతలను...

రాజీనామా చేసిన వాలంటీర్ల పెడబొబ్బలు !

తమను మల్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని వాలంటీర్లు టీడీపీ నేతల వద్దకు పరుగులు పెడుతున్నారు. తమతో బలవంతంంగా రాజీనామాలు చేయించారని వైసీపీ నేతలపై పోలీసులుకు ఫిర్యాాదు చేసేందుకు వెనుకాడటం లేదు. వారి బాధ ఇప్పుడు...

క‌థాక‌మామిషు: ఈవారం క‌థ‌ల‌పై రివ్యూ

క‌థా స్ర‌వంతిలో మ‌రో వారం గ‌డిచిపోయింది. ఈవారం (జూన్ 16) మ‌రి కొన్ని క‌థ‌లు పాఠ‌కుల ముందుకు వ‌చ్చాయి. ర‌చ‌నా శైలి ఎలా ఉన్నా, వ‌స్తువులో వైవిధ్యం క‌నిపించ‌డం మంచి ప‌రిణామం. నాన్న...

ఆయనొస్తే.. ఇక బీఆర్ఎస్ ను ఆపే వారే ఉండరు..!

తెలంగాణ గవర్నర్ గా కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ ఫ్యూచర్ పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్ గా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close