టీఆర్ఎస్‌లో 12 నియోజకవర్గాల టెన్షన్..! టిక్కెట్లెవరికి..?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పెండింగ్‌లో పెట్టిన 12 అసెంబ్లీ నియోజకవర్గాల వ్యవహారం ఆ పార్టీ ఆశావహుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. అసెంబ్లీని రద్దు చేసిన రోజే 105 మంది అభ్యర్ధులను ప్రకటించిన కెసీఆర్ ఆ తర్వతా మరో రెండు సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించారు. 12 సీట్ల ను పెండింగ్ లోపెట్టారు. అభ్యర్థులంతా పాక్షిక మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కానీ పన్నెండు నియోజకవర్గాల్లో ఆశావాహులు మాత్రం… ఖర్చు పెట్టుకోవాలా వద్దా అన్న టెన్షన్‌లో ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో కాస్త బలమైన నేతలే కావడంతో ఈ సీట్లను ఎవరికి ఇస్తే బాగుంటుందన్న దానిపై ఇప్పటికే ఫ్లాష్ సర్వేలు నిర్వహించారు. అభ్యర్థులపై ఓ నిర్ణయానికి వచ్చారు.

ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి దానం నాగేందర్, గత ఎన్నికల్లో పోటీచేసిన ఓడిన మన్నె గోవర్ధన్ రెడ్డి, పిజెఆర్ కుమార్తె, కార్పోరేటర్ విజయారెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో దానం నాగేందర్ సరైన అభ్యర్ధిగా కెసీఆర్ ఓ అంచనాకు వచ్చినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి ఆయన కోడలు విజయశాంతికి టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నా…ఆ సీటును గ్రేటర్ పార్టీ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావుకు ఫైనల్ చేశారని చెబుతున్నారు. లేకపోతే.. ఆయన పార్టీ మారేందుకు కూడా సిద్ధపడుతున్నారు. గోషామహల్ నుంచి మూసి నది అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్మెన్ ప్రేం సింగ్ రాథోడ్ కు లైన్ క్లియర్ అయింది. మేడ్చల్ నుంచి ఎంపీ మల్లారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలంటున్నాయి.

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ తాజామాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు మొండిచేయి చూపారు. అక్కడి నుంచి సుంకే రవిశంకర్ కు ఓకే చెప్పేశారు. ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఈ విషయం తెలిసి.. బొడిగే శోభ కేసీఆర్ పై విమర్శలు కూడా చేస్తున్నారు. వరంగల్ ఈస్ట్ లో మేయర్ నన్నపనేని నరేందర్ కే ఖరారయినట్లు … తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. హుజుర్ నగర్ నియోజకవర్గం నుంచి ఎవరిని నిలబెట్టాలనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను బుజ్జగించి.. ఎలాగోలా.. ఎన్ఆర్ఐలు సైదిరెడ్డి, అప్పిరెడ్డిల్లో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. ఆమెను తెలంగాణ భవన్‌కు పిలిపించి మాట్లాడారు. కోదాడలో కూటమి అభ్యర్థి ఖరారయిన తర్వాత అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.

ఈ నెల 6 న పార్టీ పూర్తి స్థాయి మానిఫెస్టో ను కేసిఆర్ తెలంగాణ భవన్ లో ప్రకటించనున్నారు. అదే రోజున అభ్యర్థుల ప్రకటన చేయాలని అనుకున్నారు. అప్పటికి కూటమి అభ్యర్ధుల ప్రకటన ఉంటుందని.. అసంతృప్తులను తమవైపు తిప్పుకోవాలని ఎత్తుగడలు వేశారు. ఈ విషయం తెలిసిందేమో కానీ.. కాంగ్రెస్ ఎనిమిదో తేదీన జాబితా విడుదల చేస్తామని ప్రకటించింది. దాంతో.. ఆ తర్వాత టిక్కెట్లు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు టీఆర్ఎస్ అధినేత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close