“కోడికత్తి పార్టీ” అంటే విజయసాయిరెడ్డి రోషం పొడుచుకు వచ్చేస్తోందా..?

ఉన్నత విద్యావంతుడైనా… రాజకీయాల్లోకి వస్తే.. నోరు కంపు చేసుకోవాల్సిందేననట్లుగా మాట్లాడే… వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి… ఇప్పుడు.. టీడీపీపై మరో రకంగా రుసరుసలాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై… విశాఖ విమానాశ్రయంలో కోడి పందేల కత్తితో దాడి జరిగిన తర్వాత.. వైసీపీ నేతలందరూ.. అది చంద్రబాబే చేయించారని.. కోరస్‌గా ఆరోపించడం ప్రారంభించారు. దానికి రివర్స్‌గా.. టీడీపీ నేతలు.. “కోడి కత్తి” అనే అంశాన్ని హైలెట్ చేసి.. వైసీపీని టీజ్ చేయడం ప్రారంభించారు. టీడీపీ సోషల్ మీడియా టీమ్.. ఈ కోడి కత్తిని వైసీపీకి ఓ బ్రాండ్‌గా మార్చేసింది. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా.. ఈ కోడి కత్తిని గుర్తుగా పెట్టుకున్నా కూడా గెలవన్నట్లుగా మాట్లాడటంతో మరింత ఫేమస్ అయింది. ఇప్పుడు.. తెలంగాణ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు తమకు కోడికత్తి గుర్తు కావాలంటూ..కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి దరఖాస్తులు పెట్టేసుకుంటున్నారు.

కానీ.. ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసిన గుర్తుల్లో కోడి కత్తి లేకపోవడంతో.. వాటినన్నింటినీ తిరస్కరిస్తున్నారు. ఇదేదో బాగా కలసి రావడంతో… టీడీపీ నేతలు.. వైసీపీని కోడి కత్తి పార్టీగా సంబోధించడం ప్రారంభించారు. చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా.. ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. కోడి కత్తిని… వాడుకుని తన ప్రభుత్వంపై మోడీ కత్తి వేటు వేయాలనుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. దీంతో.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి… చిర్రెత్తుకొచ్చింది. వైసీపీని కోడికత్తి పార్టీ అంటున్నారని… ఆయన ట్వీట్టర్ వేదికగా.. తన మార్క్ … విమర్శలు చేశారు. కోడి కత్తి పార్టీ అంటూ.. చంద్రబాబు శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. అంతుకే శునకానంద నాయుడు అని పిలుస్తానంటూ ట్వీట్లు చేశారు. విజయసాయిరెడ్డి ట్వీట్లు చూసి.. రోషం బాగా పొడుచుకు వచ్చిందే.. అని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

కోడికత్తి ఇష్యూని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లిన వైసీపీ నేతలు… దాని తీవ్రతను మాత్రం… పూర్తి స్థాయిలో చెప్పడంలో ఫెయిలయ్యారన్న భావన ఆ పార్టీలోనే ఉంది. అందుకే… జగన్ పై దాడి జరిగినా.. ఏ మాత్రం సానుభూతి రాకపోగా… సెటైర్లు వేయించుకోవాల్సి వస్తుందని… బాధపడుతున్నారు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ల వల్లే ఈ పరిస్థితులు అని వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు బాధ పడిపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

వైసీపీ నేతలు కోరుకున్న డోస్ ఇచ్చేసిన మోదీ

చిలుకలూరిపేట సభలో ప్రధాని మోదీ తమను పెద్దగా విమర్శించలేదని .. ఆయనకు తమపై ప్రేమ ఉందని.. తమ నేతను జైలుకు పంపబోని గట్టిగా ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు.. ప్రధాని మోదీ...

సెన్సార్ అయ్యింది..కానీ స‌ర్టిఫికెట్ లేదు!

'ప్ర‌తినిధి 2' విచిత్ర‌మైన స‌మ‌స్య‌లో ప‌డింది. నిజానికి గ‌త వార‌మే విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కానీ.. సెన్సార్ ఆఫీస‌ర్ సెల‌వులో ఊరు వెళ్ల‌డం వ‌ల్ల, సెన్సార్ జ‌ర‌క్క‌, ఆగిపోయింది. ఇప్పుడు సెన్సార్...

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close