ఫ‌స్ట్ లుక్‌: వీర రౌద్ర రామ‌

మెగా ఫ్యాన్స్ ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్న త‌రుణం వ‌చ్చేసింది. రామ్‌చ‌ర‌ణ్ కొత్త సినిమా టైటిల్ తో పాటు, లుక్ కూడా బ‌య‌ట‌పెట్టేశారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమాకి సంబంధించిన లుక్ విడుద‌ల చేస్తార‌ని ముందు నుంచీ చెప్పుకుంటూనే ఉన్నారు. దానికి త‌గ్గ‌ట్టుగానే… దీపావ‌ళి కానుక ఇచ్చేసింది చిత్ర‌బృందం. `విన‌య విధేయ రామ‌` అనే టైటిల్‌ని కూడా ఫిక్స్ చేసేసింది.

బోయ‌పాటి సినిమాల్లో హీరోలు మాస్ లుక్‌తోనే క‌నిపిస్తుంటారు. టైటిల్‌కి త‌గ్గ‌ట్టుగా బోయ‌పాటి ట్రెడీష‌న‌ల్ లుక్‌తో షాక్ ఇస్తాడ‌నుకున్నారు. కానీ త‌న స్టైల్‌కి త‌గ్గ‌ట్టుగా మాస్ లుక్‌నే దింపాడు. ఓ ఫైట్ సీన్‌లో.. చ‌ర‌ణ్ వీర‌త్వం చూపించే షాట్ అది. వీర, రౌద్ర ర‌సాలు పండిస్తున్న చ‌ర‌ణ్ లుక్‌ని ఫ‌స్ట్ లుక్‌గా విడుద‌ల చేసింది. దాదాపు 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close