ముద్దు పెట్టేసి ఛోటా ఏమంటున్నాడంటే..

కాజ‌ల్ – ఛోటా ముద్దు సీను టాలీవుడ్‌లో ప్ర‌కంప‌నాలే సృష్టించింది. ఛోటా వేదిక‌పై అలా చేసి ఉండ‌కూడ‌ద‌ని కొంత‌మంది అంటుంటే – చేసిన ఈ ప‌నికి త‌న‌ని టాలీవుడ్లోనే తిర‌క్కుండా చేయాలిని.. ఇంకొంత‌మంది గ‌ట్టిగానే ధ్వ‌జం ఎత్తుతున్నారు. ఇంకొంత‌మందైతే.. `చిన్న విష‌యానికి ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తారెందుకు` అని లైట్ తీసుకుంటున్నారు. ఏదైమైనా గ‌డిచిన రెండు రోజుల్లో ఛోటా కె.నాయుడు చేసిన చిలిపి ప‌ని టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. దాంతో చోటా కూడా స్పందించ‌క త‌ప్ప‌లేదు. కాజ‌ల్‌తో త‌న‌చు చాలా చ‌నువు ఉంద‌ని, త‌న‌తో చాలా సినిమాల‌కు ప‌నిచేశాన‌ని, త‌న‌ని ఓ ఫ్రెండులా చూస్తాన‌ని, కాజ‌ల్ కూడా త‌న‌ని కుటుంబ స‌భ్యుడిగా భావిస్తుంద‌ని, అందుకే.. ఆ చ‌నువుతోనే ముద్దు పెట్టాన‌ని, అంత‌కు మించిన దురుద్దేశ్యాలేం లేవ‌ని స్ప‌ష్టం చేశాడు ఛోటా కె.నాయుడు. సెట్లో కెమెరామెన్‌కీ – క‌థానాయిక‌కీ ఓ కెమిస్ట్రీ వ‌ర్క‌వుట్ అవుతూ ఉంటుంది.వాళ్లిద్ద‌రి మ‌ధ్య అనుబంధం కూడా బాగుండాలి. లేదంటే… తెర‌పై క‌థానాయిక గ్లామ‌ర్ ఎలివేట్ అవ్వ‌దు. ఆ అనుబంధాన్ని తెర వెనుక వ‌ర‌కూ ప‌రిమితం చేసుకుంటూ ఓకే. ఇలా వేదిక‌పై కి తీసుకొస్తేనే ఇబ్బందిగా ఉంటుంది. మొత్తానికి తాను ఏం చేశాడో, అందుకు ఎలాంటి రియాక్ష‌న్లు వ‌స్తున్నాయో… ఛోటా గ‌మ‌నించే అవ‌కాశం ద‌క్కింది. ఇక నుంచి ఇలాంటివి రిపీట్ చేయ‌కుండా చూసుకుంటే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చెల్లిని కించపర్చి జాతీయ మీడియాలో జగన్ నవ్వులపాలు

జాతీయ మీడియాకు జగన్ ఇచ్చిన ఇంటర్యూలు నవ్వుల పాలయ్యాయి. ఇతర విషయాల సంగతేమో కానీ చెల్లి షర్మిలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీహార్ లో పురుషాహంకారం ఉండే నేతలు కూడా...

పోస్టల్ బ్యాలెట్స్ కూడా రీపోలింగ్ – ఇదేం ఎన్నికల నిర్వహణ ?

ఎన్నికల నిర్వహణ ఎంత అసమర్థుల చేతుల్లో ఉందో తెలిపే ఘటన ఇది. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట లో పోస్టల్ బ్యాలెట్లకు బదులు ఉద్యోగులకు డమ్మీ బ్యాలెట్లు ఇచ్చారు. రోజంతా ఉద్యోగులు కష్టపడి...

రైతు భరోసా స్టార్ట్ … క్రెడిట్ బీఆర్ఎస్ దేనా..?

రైతు భరోసాకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో కేసీఆర్ తనదైన రాజకీయం ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల వేళ పెట్టుబడి కింద రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతుండటంతో ఆ క్రెడిట్ బీఆర్ఎస్ ఖాతాలో వేస్తున్నారు....

ఓటేస్తున్నారా ? : కష్టాల్లో నేనున్నానని భరోసా ఇచ్చే పాలకుడెవరో ఆలోచించండి !

ఓ డ్యామ్ పగిలిపోయింది.. కొట్టుకుపోయింది. డ్యామ్ అంటే చిన్న విషయం కాదు. ఆ డ్యామ్ ఎందుకు కొట్టుకుపోయిందన్న సంగతి తర్వాత ముందుపాలకుడు ఏం చేయాలి ?. ఉన్న పళంగా అక్కడికి వెళ్లి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close