‘నెక్ట్స్‌ ఏంటి?’ టీజర్‌: అబ్బాయిలు ఎప్పుడూ అదే ఆలోచిస్తారా??

నవతరం యువతీయువకుల ఆలోచనలు, కథతో ‘నెక్ట్స్‌ ఏంటి?’ సినిమా రూపొందిందని టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. యువతకు, కొంతమంది ప్రేక్షకులకు ముద్దుముచ్చట్లు ఉన్న కథలు నచ్చుతున్నాయని అవే అంశాలను తమ సినిమాల్లోనూ, సినిమా ప్రచార చిత్రాల్లోనూ నింపేస్తున్నారు. అందుకు ‘నెక్ట్స్‌ ఏంటి?’ టీజర్‌ మినహాయింపు ఏం కాదు. కాకపోతే కాస్త క్లాస్‌గా చెప్పారు. టీజర్‌ ప్రారంభంలో తమన్నా ‘అసలు మీ అబ్బాయిలు ఏం ఆలోచిస్తూ వుంటారు?’ అని నవదీప్‌ను అడుగుతుంది. అందుకు బదులుగా అతడు ‘మీకు తెలియదా?’ అంటే… ‘24/7 దాని గరించేనా?’ అంటుందామె. ‘100%’ అంటాడు నవదీప్‌. బ్యాగ్రౌండ్‌లో విజువల్స్‌ కూడా అందుకు తగ్గట్టున్నాయి. ‘అమ్మాయిల విషయంలో అవకాశాలు అస్సలు రావు. వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి’ అని సందీప్‌ అంటాడు. విజువల్స్‌ క్లాస్‌గా వున్నాయి. బాలీవుడ్‌ దర్శకుడు కునాల్‌ కోహ్లీ బాలీవుడ్‌ సినిమాను తీసినట్టే ‘నెక్ట్స్‌ ఏంటి?’ తీసినట్టున్నారు. అక్కడక్కడా తెల్లజుట్టుతో నవదీప్‌, ఎర్రజుట్టతో తమన్నా లుక్స్‌ విషయంలో ప్రయోగాలు చేశారు. సందీప్‌ కిషన్‌ లుక్‌ పరంగా, యాక్టింగ్‌ పరంగా కొత్తగా కనిపించలేదు. ఇక, టీజర్‌ ఎండింగ్‌లో తమన్నా చెప్పిన ‘నువ్వు మ్యాగీ టూ మినిట్స్‌ న్యూడిల్‌గాడివని చెబుతా. సో బంగారం… నువ్వు చెప్పిన మేటర్‌ కన్నా, నేను చెప్పిన మేటర్‌ ఫాస్ట్‌గా ట్రెండ్‌ అవతుంది’ డైలాగ్‌ అయితే ఫాస్ట్‌గా ట్రెండ్‌ అవుతుందనడంలో సందేహం లేదు. టీజర్‌ వరకూ ఓకే.. సినిమాలో మేటర్‌ని బట్టి సక్సెస్‌ ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.