‘సైరా’ ఇన్‌సైడ్ టాక్: సెట్లో చిరు రుస రుస‌

చిరంజీవి దృష్టంతా ఇప్పుడు`సైరా న‌రసింహారెడ్డి`పైనే ఉంది. ‘ఖైది నెం.150’లాంటి బ్లాక్ బ్ల‌స్ట‌ర్ త‌ర‌వాత రాబోతున్న చిరు సినిమా ఇది. ఈ సినిమా వ‌సూళ్ల‌కు మించి `సైరా` కోసం ఖ‌ర్చు పెడుతున్నారు. సైరా బ‌డ్జెట్ (చిరు పారితోషికంతో క‌లిపి) దాదాపు రూ.200 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని స‌మాచారం. హిందీలోనూ ఈ సినిమా విడుద‌ల చేస్తారు. కాబ‌ట్టి మార్కెట్ ప‌రంగానూ వ‌ర్క‌వుట్ అయ్యే ఛాన్సులు క‌న‌పిస్తున్నాయి. ఈ చిత్రానికి చ‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. `విన‌య విధేయ రామా` పనుల్లో చ‌ర‌ణ్ బిజీగా ఉండ‌డంతో – నిర్మాణ బాధ్య‌త‌లు కూడా చిరునే చూసుకుంటున్నాడ‌ట‌. అందుకే.. సెట్లో చిరు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నాడ‌ని, త‌న క‌ళ్ల ముందు దుబారా జ‌రిగితే ఏమాత్రం స‌హించ‌డం లేద‌ని తెలుస్తోంది. ఓ సంద‌ర్భంలో ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డిపై చిరు సీరియెస్ అయ్యాడ‌ని, అన‌వ‌స‌ర‌మైన చోట కూడా ఎక్కువ ఖ‌ర్చు పెట్టిస్తున్నాడ‌న్న విష‌యం తెలిసి.. సురేంద‌ర్ రెడ్డిని క్లాస్ తీసుకున్నాడ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ఒక‌ట్రెండు సంద‌ర్భాల్లో చిరు ప్ర‌వ‌ర్త‌న చూసి సురేంద‌ర్ రెడ్డి కూడా నొచ్చుకున్నాడ‌ని తెలుస్తోంది. చ‌ర‌ణ్ సెట్లో ఉంటే మాత్రం చిరంజీవి మ‌రే విష‌యాల్నీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, చ‌ర‌ణ్ కూడా కూల్‌గా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్తున్నాడ‌ని, సూరిపై ఎలాంటి ఒత్తిడి ప‌డ‌కుండా కాపు కాస్తున్నాడ‌ని, చర‌ణ్ లేక‌పోతేనే… చిరు కాస్త అస‌హ‌నంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు స‌మాచారం అందించాయి. అటు హీరోయిజం, ఇటు ప్రొడ‌క్ష‌న్ రెండు బాధ్య‌త‌లూ చూసుకోవాలంటే ఎలాంటివాళ్ల‌కైనా ఈ మాత్రం టెన్ష‌న్ ఉంటుంది.చిరు కూడా అలా టెన్ష‌న్ ప‌డుతున్నాడేమో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

సీరం ఇన్‌స్టిట్యూట్ బీజేపీకి 50 కోట్ల విరాళం ఇచ్చిందా…కారణం ఇదేనా..?

కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా...

బేలగా మోదీ ప్రచారం – ఏం జరుగుతోంది ?

నరేంద్రమోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. ఇటీవల తనను...

అబద్దాల ప్రభుత్వం – అమల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ పెట్టి అదే చెబుతున్నారు. కోర్టుల్లో తీర్పులు వచ్చిన తర్వాతనే అమలు చేస్తామని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close