సంగారెడ్డి నుంచి ఇక తాను పోటీ చేయబోనని తన భార్య పోటీ చేసినా సరే ప్రచారం కూడా చేయబోనని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయనను ఓడించారట. రాహుల్ ను తీసుకొచ్చి ప్రచారం చేయించినా ఓడించారని ఆయన బాధపడుతున్నారు. అందుకే ప్రజల్ని శిక్షిస్తానన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రచారం చేయనని చెబుతున్నారు.
జగ్గారెడ్డి తీరు చెరువుపై అలిగినట్లుగా ఉందని కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేసుకుంటున్నారు.రాజకీయాల్లో ప్రజలు ఇచ్చే తీర్పును స్వాగతించాలి. అంతే కానీ వారిపై అలిగితే ప్రజలకు పోయేదేమీ లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రజలకు ఎంత చేస్తారో చూస్తూనే ఉన్నారు. ఆయన పోటీ చేయకపోతే వంద మంది పోటీ చేస్తారు.. యువనేతలు పోీట చేసి గెలిచి మంచి అభివృద్ధి చేస్తారు. తాను లేకపోతే సంగారెడ్డి అభివృద్ధి చెందదని అనుకోవడం జగ్గారెడ్డి ఓవర్ కాన్ఫిడెన్స్ కు నిదర్శనం అనుకోవచ్చు.
2018 ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం నకిలీ పాస్ పోర్టు కేసులో జైల్లో పెట్టింది. ఆయనను విడుదల చేయించడానికి రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు గట్టిగా కష్టపడ్డారు. జైలు నుంచి వచ్చిన ఆయనకు సానుభూతి లభించింది. కాంగ్రెస్ ఓడిపోయినా ఆయన గెలిచారు. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ గాలి వీచినా .. ప్రభుత్వం వచ్చినా ఆయన ఓడిపోయారు. ఆయన గెలిచి ఉంటే మంత్రి పదవి వచ్చేదని.. దాన్ని తనకు రాకుండా ప్రజలే చేశారని ఆయన ఫీలవుతున్నారు. అందుకే అలిగినట్లుగా నటిస్తున్నారు.


