నా కుమారుడు బండి భగీరథ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై ఉన్న గౌరవంతో ఈరోజు అడ్వకేట్ల ద్వారా అతడిని పోలీసు విచారణకు అప్పగించాను
చట్టం ముందు నా బిడ్డ అయినా సామాన్యుడైనా ఒకటే… అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే
తను ఏ తప్పూ చేయలేదని నా కుమారుడు పదేపదే చెబుతున్నాడు
ఫిర్యాదు రాగానే స్టేషన్‌కు పంపిద్దామనుకున్నాం కానీ లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను చూపించాం
మా ఆధారాలు చూసి కేసు కొట్టేస్తారని… బెయిల్ ఖచ్చితంగా వస్తుందని లాయర్లు చెప్పడం వల్లే కొంత జాప్యం జరిగింది
ఈరోజు కూడా బెయిల్ వస్తుందని లాయర్లు చెబుతున్నా ఇంకా ఆలస్యం చేయడం సరికాదనే ఉద్దేశంతోనే పోలీసులకు అప్పగించాను
సోమవారం నాడే కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ న్యాయవ్యవస్థపై ఉన్న గౌరవంతో ఇంకా ఆలస్యం కావొద్దనే విచారణకు పంపించాను
మాకు న్యాయవ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకం ఉంది

